ఎం.ఫార్మసీలో గోల్డ్ మెడల్.. సత్తా చాటుకున్న దివ్యజ్యోతి

కరీంనగర్ (ఆంధ్రప్రభ): తిమ్మాపూర్‌లోని శ్రీ చైతన్య ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ సైన్సెస్‌కు చెందిన వావినీల దివ్యజ్యోతి ఎం.ఫార్మసీ (ఫార్మాస్యూటిక్స్) 2014 బ్యాచ్‌లో గోల్డ్ మెడల్ సాధించి ప్రతిభ చాటుకున్నారు. చదువుపై అంకితభావం, నిరంతర కృషితో ఈ ప్రతిష్ఠాత్మక విజయాన్ని సొంతం చేసుకున్నారు. దివ్యజ్యోతి సాధించిన విజయంపై కుటుంబ సభ్యులు, అధ్యాపకులు, స్నేహితులు హర్షం వ్యక్తం చేశారు. ఆమెను అభినందించి భవిష్యత్తులో మరిన్ని ఉన్నత విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.