TTD Committee Members | శ్రీవారి సన్నిధిలో ఎమ్మెల్యే జయసూర్య..

TTD Committee Members | శ్రీవారి సన్నిధిలో ఎమ్మెల్యే జయసూర్య..
ఎమ్మెల్యే గిత్త…!
శ్రీవారి చెంత ఎమ్మెల్యే జయసూర్య
ప్రజల క్షేమమే నా మొక్కు
TTD Committee Members |నందికొట్కూర్, ఆంధ్రప్రభ : తిరుమల కొండపై కొలువైన ఆ దేవదేవుడికి మొక్కులు చెల్లించారు నందికొట్కూరు ఎమ్మెల్యే గిత్త జయసూర్య ప్రజల చల్లని దీవెనలే నాకు శ్రీరామరక్ష” అంటూ శ్రీవారి దర్శనంతో పులకించిపోయారు. కలియుగ దైవం తిరుమల వేంకటేశ్వర స్వామిని దర్శించుకోవడం జరిగిందని అన్నారు ఆలయ గోపురం వద్ద టీటీడీ కమిటీ సభ్యులు ఘనంగా ఆహ్వానించారు అనంతరం ఎమ్మెల్యే గిత్త జయసూర్య ప్రత్యేక పూజలు స్వామికి విశేష పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే గిత్త జయసూర్య మాట్లాడుతూ.నియోజకవర్గ ప్రజలందరూ ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో ఉండాలని శ్రీవారిని వేడుకున్నాను” అని తెలిపారు.శ్రీవారి దర్శనం లభించడం నా పూర్వజన్మ సుకృతం. స్వామి ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలి” అని ఆయన ఆనందం వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో టిడిపి మండల కన్వీనర్ మాండ్ర సురేంద్ర నాథ్ రెడ్డి రవీంద్రబాబు మద్దిలేటి రాజశేఖర్ సతీష్ రాంబాబు ఆచారి హుస్సేన్ తదితరులు పాల్గొన్నారు
