Trump’s China trip I చైనాలో ట్రంప్ పర్యటన ఎవరికి కలిసొచ్చింది?

దూకుడు కనబర్చని ట్రంప్
చైనాతో ఆచీతూచీ వ్యవహరించిన అమెరికా
అమెరికాకు ఒరిగేది లేదు
ప్రపంచ దేశాలకు నిరాశ
ఎవరి స్వార్థం వారు చూసుకున్నారు…
అందుకే చైనా కూడా తైవాన్ విషయాన్ని ప్రస్తావించలేదు
ఇరాన్ చమురు కొనుగోలులో సానుకూలత…
అమెరికా వ్యవసాయ భూములు చైనా కొనుగోలులో వెనుక్కు తగ్గిన ట్రంప్
అమెరికా-చైనా సంబంధాలు ఎంతవరకు మారుతుందో చూడాలి

ఆంధ్రప్రభ వెబ్ (అంతర్జాతీయం) : అగ్రరాజ్య అధినేత, అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ చైనా పర్యటనలో వ్యవహరించిన తీరు ప్రపంచ దేశాలను ఆశ్చర్యపరిచింది. నోబుల్ శాంతి బహుమతి కోసం ప్రయత్నం చేస్తున్న ట్రంప్ పశ్చిమాసియా ఉద్రిక్తతల నేపథ్యంలో ఇరాన్ కు మద్దతు ఇస్తున్న చైనాతో చర్చిస్తారని ఆశించిన ప్రపంచ దేశాలకు నిరాశే ఎదురైంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చాలా కాలంగా చైనా విషయంలో తనకు తాను ఒక బలవంతుడిగా చిత్రీకరించుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. అయినప్పటికీ చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ పట్ల ఆయన కనబరిచే సర్దుబాటు స్వభావంతో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కఠినమైన మాటలు, వాణిజ్య యుద్ధాలు బలహీనపడతాయని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. చైనాపై కఠినంగా వ్యవహరిస్తామన్న తన గత ఎన్నికల వాగ్దానాల నుండి కూడా ట్రంప్ వెనక్కి తగ్గినట్లు కనిపించింది. అమెరికాకు తైవాన్ అత్యంత ప్రముఖమైన అంశం. చైనా నుండి దానిని రక్షించడం అమెరికా ఏ అధ్యక్షుడికైనా ఒక క్లిష్టమైన అంశం. అందుకే చైనా పర్యటనలో ట్రంప్ ఆచీతూచీ వ్యహరించారు.

తైవాన్‌పై తర్వాత చూద్దాం…
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పర్యటన కూడా ఒక గణనీయమైన విజయం సాధించినట్లే. ఎందుకంటే ట్రంప్ ప్రభుత్వం ఇప్పటికే తైవాన్‌కు 11 బిలియన్ డాలర్ల విలువైన ఆయుధాలను పంపింది. వేల సంవత్సరాలుగా తైవాన్ చైనాలో అంతర్భాగంగా ఉందని జిన్‌పింగ్ చెప్పిన అంశాలనే ట్రంప్ కూడా ప్రస్తావించారు. ఈ విషయంపై చైనాను సంప్రదించడం కూడా ఒక విశేషమే. 1982లో రొనాల్డ్ రీగన్, ఇటువంటి ఆయుధ విక్రయాల విషయంలో అమెరికా చైనా అభిప్రాయాన్ని కోరదని స్పష్టంగా ప్రకటించారు. 1982 నాటి ఆ పత్రం గురించి ట్రంప్ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ… ” నేను ఏం చేయాలి? దీని గురించి మాట్లాడదలుచుకోలేదు అని చెప్పాలా? కేవలం 1982లో కుదిరిన ఒక ఒప్పందం ఉంది కాబట్టి అలా అనాలా? కాదు, తాము ఆయుధ విక్రయాల గురించి చర్చించాం.” చైనా సాధించిన విజయాల్లో ఇది ఒక్కటి. అలాగే భారీ ఒప్పందాల రూపంలో ట్రంప్‌కు పెద్దగా ఏమీ దక్కనప్పటికీ, చైనా మాత్రం ఇటువంటి విజయాలను సొంతం చేసుకుందని చెప్పాలి.

ఇరాన్ చమురు కొనుగోలులో సానుకూలత…
ఇరాన్ చమురును కొనుగోలు చేస్తున్న చైనా కంపెనీలపై ఆంక్షలను ఎత్తివేయడాన్ని పరిశీలిస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడు కూడా చెప్పారు. చైనా గూఢచర్య ప్రయత్నాలపై మాట్లాడాటానికి నిరాకరించారు. చైనా సైబర్ దాడుల గురించి నిలదీసినప్పుడు, ట్రంప్ దానిని ఇరుపక్షాల సమస్యగా కొట్టిపారేశారు.
అమెరికా వ్యవసాయ భూములు చైనా కొనుగోలు విషయంలో..
చైనా అమెరికా వ్యవసాయ భూములను కొనుగోలు చేసే సమస్య ఉంది. డెమొక్రాట్లు, రిపబ్లికన్లు ఇద్దరూ ఈ పద్ధతిని నిషేధించడానికి మద్దతు ఇస్తున్నారు. ఈ ఆలోచన ముఖ్యంగా మితవాదులలో బాగా ప్రాచుర్యం పొందింది. 2024 ప్రచారపు చివరి దశలో, రాజకీయ నాయకులు “మన దేశాన్ని మన కళ్ల ముందే అమ్ముకోవడానికి అనుమతిస్తున్నారు” అని చెబుతూ, దానిని నిషేధిస్తానని ట్రంప్ ప్రతిజ్ఞ చేశారు. అమెరికా వ్యవసాయ భూములపై చైనా యాజమాన్యాన్ని నిషేధించడం వంటి వాటిపై ఆయన ప్రధానంగా వెనక్కి తగ్గినట్లు కనిపిస్తోంది. ఇది కూడా చైనాకు కలిసొచ్చిన అంశం.

చైనా విద్యార్థులు మంచివారు..
చైనా విద్యార్థుల వీసాలను తీవ్రంగా రద్దు చేస్తామని ట్రంప్ ప్రభుత్వం కూడా చెప్పింది. ఎయిర్ ఫోర్స్ వన్‌లో ట్రంప్ దీనిపై ఆచీతూచీ మాట్లాడారు. చైనా విద్యార్థులను మంచి విద్యార్థులు అని పిలిచారు. నాకు ఏ విద్యార్థులూ వద్దు అని ఒక దేశానికి చెప్పడం చాలా అవమానకరమైన విషయం అని ట్రంప్ అంటూ పలు ప్రశ్నలకు దాట వేశారు…

అమెరికా-చైనా సంబంధాలు ఎంతవరకు మారుతుందో…
అమెరికా అధ్యక్షుడి పర్యటనతో అమెరికా-చైనా మధ్య సంబంధాలు ఎంతవరకు మారుతుందో చూడాలి. చైనాతో ఆయన ప్రాధాన్యతా జాబితాలో, దాని ప్రభావాన్ని ఎదుర్కోవడం కంటే ఒప్పందాలు కుదుర్చుకోవడానికే అంతకంతకూ అధిక ప్రాధాన్యత ఇచ్చినట్లు కనిపించింది. ఈ పర్యటన తర్వాత చైనాతో అమెరికా సంబంధాలు వాస్తవంగా ఎంతవరకు మారవచ్చో గమనించడం ముఖ్యం. ట్రంప్ మెరుగైన సంబంధాలను ఆకాంక్షించినప్పటికీ, తన పార్టీ సభ్యులను ఒప్పించడం కష్టమే కావచ్చు అనేది అమెరికా పరిశీలకుల భావన. ట్రంప్ నిజమైన చైనా వ్యతిరేకి అనే మిగిలి ఉన్న భ్రమలన్నింటినీ ఈ పర్యటనతో తొలగిపోయాయని ప్రపంచ దేశాల పరిశీలకుల అభిప్రాయం.
