సాంకేతిక నైపుణ్యతతో శిక్షణ

సాంకేతిక నైపుణ్యతతో శిక్షణ

వికారాబాద్‌, ఆంధ్రప్రభ : ఈ రోజు వికారాబాద్ పట్టణ కేంద్రంలోని ఆధునాతన సాంకేతిక కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్(District Collector Prateek Jain) సందర్శించారు. ఏటీసీ(ATC)లలో సాంకేతిక నైపుణ్యతతో కూడిన శిక్షణను అందించాలని జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ అధికారులకు సూచించారు. ఈ సందర్భంగా ఏటీసీలో గల సౌకర్యాలపై కలెక్టర్ ఆరా తీశారు. ఏటీసీలో శిక్షణ పొందుతున్న విద్యార్థినీ విద్యార్థుల(students)తో కావలసిన మౌలిక సదుపాయాలు, వివిధ సౌకర్యాలపై కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు.

శిక్షణ నిమిత్తం(for training) వచ్చిన విద్యార్థులకు ఆధునాతన సాంకేతికలో పట్టు సాధించే విధంగా విద్యార్థినీ విద్యార్థులను తీర్చిదిద్దాలని అధికారులకు కలెక్టర్ సూచించారు. ఏటీసీలో ఏవైనా సమస్యలు ఉంటే తన దృష్టికి తీసుకురావాలని కలెక్టర్ తెలిపారు. ఫర్నిచర్ లేని పరిస్థితిని గ్రహించిన కలెక్టర్ విద్యార్థులకు సరిపోను కుర్చీలను సమకూరుస్తానని అన్నారు. ఈ సందర్శనలో భాగంగా ఏటీసీ ఇంచార్జ్ ఎస్.ఎం. సరూష్(S.M. Sarush), ఏటీ సిబ్బంది ఉన్నారు.

Leave a Reply