Keerthy Suresh | మ‌హాన‌టికి బాలీవుడ్ ముద్దంట !

స్కిన్‌ షో చేయకుండా హీరోయిన్‌గా ఇన్నాళ్లు కొనసాగడం అనేది చాలా అరుదుగా చూస్తూ ఉంటాం. కానీ కీర్తి సురేష్ మాత్రం మహానటితో పాటు పలు సినిమాల్లో తన నటనతో మెప్పించి స్టార్‌ హీరోయిన్‌గా నిలిచింది.

తక్కువ సమయంలోనే తెలుగు, తమిళ్‌ ఇతర భాషల్లోనూ సినిమాలు చేయడం ద్వారా పాపులారిటీని సొంతం చేసుకుంది. ఈమధ్య కాలంలో హిందీ సినిమాల్లోనూ నటించడం ద్వారా బాలీవుడ్‌లో మంచి గుర్తింపు సొంతం చేసుకుంది.

బేబీ జాన్‌ సినిమాతో బాలీవుడ్‌లో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన కీర్తి సురేష్ మరిన్ని సినిమాలు చేసేందుకు ఆసక్తిగా ఎదురు చూస్తుంది. మొదటి సినిమా నిరాశ పరచినా వెంటనే ఒక హిందీ వెబ్‌ సిరీస్‌లో నటించే అవకాశాన్ని దక్కించుకుంది.

సాధారణంగా హీరోయిన్స్ స్కిన్‌ షో ఫోటోలు షేర్ చేసి సోషల్ మీడియాలో వైరల్‌ అవుతూ ఉంటారు. కానీ కీర్తి సురేష్ మాత్రం స్కిన్‌ షో చేయకుండానే ఫోటోలను షేర్‌ చేస్తూ వైరల్‌ అవుతూ ఉంటుంది.

తాజాగా కీర్తి సురేష్ మరోసారి క్యూట్‌ ఫోటోలు షేర్‌ చేయడం ద్వారా వైరల్‌ అవుతోంది. సింపుల్‌ డ్రెస్‌లో లూజ్‌ హెయిర్‌తో క్యూట్‌ స్మైల్‌తో పిచ్చెక్కించే విధంగా కీర్తి సురేష్ లుక్ ఉంది.

తెలుగులో కీర్తి సురేష్ చివరగా కల్కి 2898 ఏడీ సినిమాలో వినిపించింది. అందులోని ఒక రోబోకి కీర్తి సురేష్ వాయిస్ ఓవర్‌ ఇచ్చింది. అంతకు ముందు తెలుగులో భోళా శంకర్‌ సినిమాలో నటించింది.

ఆ సినిమాలో హీరోయిన్‌గా కాకుండా కీలక పాత్రలో నటించింది. టాలీవుడ్‌లో నానికి జోడీగా దసరా సినిమాలో హీరోయిన్‌గా నటించడం జరిగింది. కానీ ప్రస్తుతం ఈమె దృష్టి మొత్తం హిందీ సినిమాలపై ఉంది.

పెళ్లి తర్వాత కూడా వరుసగా సినిమాలు, సిరీస్‌ల్లో నటిస్తూ బిజీగా ఉంది. రెండు తమిళ్‌ సినిమాలను సైతం ఈమె నటిస్తోంది. తెలుగులో మాత్రం ఒక్క సినిమా కూడా చేతిలో లేక‌పోవ‌డం గ‌మ‌నార్హం..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *