Top Stars | అసలు కారణం ఇదే..

Top Stars | అసలు కారణం ఇదే..
ఆంధ్రప్రభ వెబ్ డెస్క్ : ఒకప్పుడు అయితే.. కాంబినేషన్ ను నమ్ముకునేవాళ్లు. కానీ.. ఇప్పుడు కాలం మారింది. కథనే నమ్ముకుంటున్నారు. ఎంత పెద్ద డైరెక్టర్ అయినా.. కథ బాగోకపోతే మరో కథతో(With another story) చేద్దామని చెప్పేస్తున్నారు. దర్శకుడు చెప్పిన కథలో లైన్ బాగుండి.. కథనం బాగోకపోతే.. మార్పులు చేర్పులు చేస్తున్నారు. ఒక్కోసారి ఏకంగా కథే మార్చేస్తున్నారు. ఇద్దరు స్టార్ హీరోల సినిమాల కథలు ఇలాగే మారిపోయాయని తెలిసింది. ఇంతకీ.. ఆ ఇద్దరు స్టార్ హీరోలు(Two star heroes) ఎవరు..? అసలు ఏం జరిగింది..?
Top Stars | స్టోరీ లాక్ అయినా..

మెగాస్టార్ చిరంజీవి సంక్రాంతికి మన శంకర్ వరప్రసాద్ గారు సినిమాతో వస్తున్నారు. దీనికి అనిల్ రావిపూడి డైరెక్టర్(Anil Ravipudi Director). ప్లాప్ అనేది లేకుండా వరుసగా సక్సెస్ సాధిస్తుండడంతో ఈ సినిమా రిలీజ్ కాకుండానే బ్లాక్ బస్టర్(Blockbuster even before release) అనే టాక్ తెచ్చుకుంది. జనవరి 12న ఈ సినిమాను గ్రాండ్ గా రిలీజ్ చేయనున్నారు. ఈ సినిమా తర్వాత మెగాస్టార్.. బాబీతో సినిమా చేయనున్నారు. ఆల్రెడీ ఈ మూవీని ఆనౌన్స్(Movie announcement) చేయడం కూడా జరిగింది. అయితే.. ఈ సినిమా కథ లాక్ అయినప్పటికీ.. ఇప్పుడు కథను మారుస్తున్నారని తెలిసింది. కారణం ఏంటంటే.. ఇటీవల రిలీజై సక్సెస్ సాధించిన సినిమాకి, బాబీ రెడీ చేసిన కథకు కొన్ని పోలికలు ఉన్నాయట. అందుకనే కథను మారుస్తున్నారని సమాచారం.
Top Stars | లీక్ కాలేదు కానీ..

కథను మారుస్తున్న మరో స్టార్ బాలయ్య. ఇటీవల అఖండ 2 సినిమాతో(With the movie Akhanda 2) ప్రేక్షకుల ముందుకు వచ్చిన బాలయ్య.. మలినేని గోపీచంద్ తో సినిమాను అనౌన్స్ చేసిన విషయం తెలిసిందే. వీరిద్దరి కాంబోలో గతంలో వీరసింహారెడ్డి అనే సినిమా వచ్చింది. ఆ సినిమా సక్సెస్ అయ్యింది. ఇప్పుడు హిస్టారిక్ స్టోరీ(Historic Story)తో సినిమా చేయాలి అనుకున్నారు. అయితే.. బడ్జెట్ ఎక్కువు అవుతుందనే ఉద్దేశ్యంతోనో.. అఖండ 2 రిజెల్ట్ వలనో కారణం ఏంటి అనేది లీక్ కాలేదు కానీ.. ప్లాన్ మాత్రం మారిందని తెలిసింది. ముందుగా అనుకున్న కథను పక్కన పెట్టి ఇప్పుడు మరో కథతో సినిమా చేస్తున్నారు అనేది ఇండస్ట్రీ ఇన్ సైడ్ న్యూస్(Industry Inside News). మరి.. ముందుగా అనుకున్న కథను కాదని.. మరో కథతో చేస్తున్న చిరు, బాలయ్య సినిమాలు ఎలాంటి ఫలితాలు అందిస్తాయో చూడాలి.
CLICK HERE TO READ ఆ నలుగురుకి.. సంక్రాంతి సక్సెస్ అందించేనా..?
