Tirumala | భవనం పై నుంచి పడి కార్మికుడు మృతి

Tirumala | ఆంధ్రప్రభ, వెబ్‌డెస్క్ : తిరుమలలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. మూడంతస్తుల భవనంపై మరమ్మతులు చేస్తుండగా ప్రమాదవశాత్తు కిందపడిన కార్మికుడు చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది.
అవధూత దత్తపీఠం వద్ద ఉన్న భవనంపై వాటర్ ట్యాంక్ మరమ్మతులు చేస్తున్న సమయంలో మణికంఠన్ (35) అనే కార్మికుడు కాలుజారి కిందపడినట్లు సమాచారం. తీవ్ర గాయాలపాలైన అతడిని వెంటనే తిరుపతిలోని రుయా ఆసుపత్రికి తరలించారు.
ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మణికంఠన్ మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. మృతుడు తమిళనాడులోని తిరుపత్తూర్ వనియంబాడికి చెందినవాడిగా గుర్తించారు. ఘటనపై తిరుమల పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
