Flash over : ఆత్మీయుల వెతుకులాట Andhtra Prabha Detail News
Flash over : ఆత్మీయుల వెతుకులాట Andhtra Prabha Detail News
బాధితులందరూ టీనేజర్లే
స్వర్గధామం అల్ఫైన్ వలవల
40 మంది మృతి .. 115 మందికి గాయాలు
24 మంది గల్లంతు
ఆత్మీయుల గాలింపు
బొగ్గు దేహాలకు పరీక్షలు
ఇది అత్యంత విషాదం : దేశాధ్యక్షుడు దిగ్ర్బాంతి
మృతులకు పుష్పాంజలి
( ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్)
పర్యాటకుల మది అది సురక్షిత స్వర్గధామం. ఎలాంటి ఇబ్బందులు ఉండవు. ఆనందానికి అంతులేదు. అదే.. ఆల్ఫైన్ హెవెన్ (Alpine Heaven) . ఇప్పడదు హెల్ వ్యూ (Hell View) ..గా మారిపోయింది. క్షణాల్లో (Deadly Blaze) 40 మంది మంటల్లో కాలిపోయారు. బొగ్గు ముక్కలుగా మారారు. 115 మంది (Burn Wounds) కాలిన బొబ్బలతో అల్లాడిపోతున్నారు.

వీరిలో ఎందరు బతుకుతారో తెలీదు. రంగు రంగుల విద్యుల్లతలతో కన్నుల విందు పంచుతూ,. సంగీత జడిలో ఉర్రూతలూగించిన ‘లే కాన్స్టెలేషన్’ బార్ లో.. ఇప్పుడు నిర్జీవ శవాల గుట్టల్లో.. తమ బిడ్డల జాడ కోసం అమ్మానాన్నలు.. స్నేహితులు వెతుకుతున్నారు. కన్నీటి పొరల్లో తమ ఆత్మీయుల జాడ కోసం అల్లాడిపోతున్నారు. ఆనందంగా.. చిందులేసిన ఈ టీనేజర్లు బొగ్గులుగా మారటంతో.. వీరిని గుర్తించేందుకు అధికారులు డీఎన్ ఏ, దంత పరీక్షలకు సిద్ధమయ్యారు. ఒకరకంగా… గుండెకోతతో.. వాలిస్ సిటీ అత్యవసర పరిస్థితిని ప్రకటించింది.
Flash over : ‘ఫ్లాష్ ఓవర్’ నరమేధం
స్విట్జర్లాండ్ స్వర్గధామం ఆల్పైన్ స్కీ రిసార్ట్ సిటీలోని క్రాన్స్-మొంటానా (Crans-Montana) లో.. జనవరి 1, 2026 తెల్లవారుజామున సుమారు 1:30 గంటలకు డెడ్లీ బ్లేజ్ టెర్రర్ కు ఫ్లాష్ ఓవరే కారణమని అధికారులు గుర్తించారు. ఈ రిసార్ట్‌లోని అత్యంత రద్దీగా ఉండే ‘లే కాన్‌స్టెలేషన్’ (Le Constellation) బార్‌లో చోటు చేసుకున్న ఫ్లాష్ ఓవర్ తో .. 40 మంది బుగ్గయ్యారు.

115 మంది తీవ్రంగా గాయపడ్డారు. సుమారు 16 మంది ఇటాలియన్లు, 8 మంది ఫ్రెంచ్ పౌరులు (24 Missi=ed) గల్లంతయ్యారు. తీవ్రంగా కాలిపోవడంతో మృతదేహాలను గుర్తించలేని స్థితి ఏర్పడింది.

ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం, షాంపైన్ బాటిళ్లపై వెలిగించిన ‘స్పార్క్లర్ క్యాండిల్స్’ (Sparker Candles) (మెరుపు కొవ్వొత్తులు) బార్ సీలింగ్‌కు అంటుకోవడంతో మంటలు రగిలాయి. గాలిలోని వాయువుల వల్ల ఒక్కసారిగా మంటలు ఎగిసిపడి ‘ఫ్లాష్ ఓవర్’ (flashover) స్థితికి దారితీసింది. క్షణాల్లో భారీ పేలుడు సంభవించినట్లు అధికారులు భావిస్తున్నారు. ఇది ఉగ్ర దాడి కాదని పోలీసులు పూర్తిగా తోసిపుచ్చారు.

మృతులు, క్షతగాత్రుల్లో స్విస్ (Swiss Citizen) పౌరులు, విదేశీ పర్యాటకులు (Tourists) అధికంగా ఉన్నారు. ముఖ్యంగా ఇటలీ (15 మంది గాయపడ్డారు), ఫ్రాన్స్ (9 మంది గాయపడ్డారు) దేశాలకు చెందిన యువకులే ఎక్కువగా ఉన్నారు. ఒక ఆస్ట్రేలియన్ పౌరుడు కూడా గాయపడినట్లు సమాచారం.క్షతగాత్రుల్లో అత్యధికులు ఇటలీ (15 మంది) ఫ్రాన్స్ (9 మంది) దేశస్తులు. ఒకరు ఆస్ట్రేలియన్ మరొక బ్రెజిల్ ఫుట్‌బాల్ ఆటగాడు (FC Metz యువ క్రీడాకారుడు) కూడా తీవ్రంగా గాయపడ్డారు. సుమారు 16 మంది ఇటాలియన్లు 8 మంది ఫ్రెంచ్ పౌరులు ఇంకా గల్లంతు అయ్యారు.
Flash over : అత్యవసర పరిస్థితి
వాలైస్ (Valais) ప్రభుత్వం అత్యవసర పరిస్థితిని (State of Emergency) ప్రకటించింది. స్విట్జర్లాండ్‌లోని బర్న్ యూనిట్లు బాధితులతో నిండిపోవడంతో, క్షతగాత్రులను ఇటలీ (మిలన్), ఫ్రాన్స్ (లియోన్, పారిస్) జర్మనీలోని ఆసుపత్రులకు తరలించారు.

స్విస్ అధ్యక్షుడు గై పార్మెలిన్ (Guy Parmelin) ఈ ఘోరఖలి దేశ చరిత్రలో ఇది అత్యంత ఘోర విషాదం అన్నారు.

రిసార్ట్ సమీపంలో బాధిత కుటుంబాల కోసం సహాయక కేంద్రాలు హెల్ప్‌లైన్లను ఏర్పాటు చేశారు. లే కాన్స్టెలేషన్ బార్ మంటలు చెలరేగడంతో జనంలో భయాందోళనలు నెలకొన్నాయి. తాను అరుపులు విన్నానని, ఆ తర్వాత యువకులు నేలపై పడి పోయారని ఒక ప్రత్యక్ష సాక్షి చెప్పాడు.
Flash over : అమ్మానాన్న వెతుకులాట
స్విస్ స్కీ రిసార్ట్ బార్‌లో జరిగిన ఘోర ప్రమాదంలో తప్పిపోయిన కుమారుడు కోసం తల్లిదండ్రులు వెతుకులాట ప్రారంభించారు. అతను బతికే ఉన్నాడనే ఆశతో.. గాలిస్తున్నారు. లౌసాన్‌కు చెందిన క్రిస్టోఫ్ లెటిటియా బ్రోడార్డ్ ఈ బార్‌లో ఓ టేబుల్ బుక్ చేశాడు.

తన 10 మంది స్నేహితులతో కలిసినప్పటి వేడుకల్లో పాల్గొన్నాడు. తన 16 ఏళ్ల కుమారుడు ఆర్థర్ సమాచారం అందలేదు. ఆ బృందంలోని యువకులు లౌసాన్‌లోని కాలేజీజీ చాంపిట్టెట్ పుల్లీ పాఠశాలలో చదువుతున్నారు. తరచుగా ఈ రిసార్ట్ లో కలుస్తారు. ప్రస్తుతం మేము ఒంటరిగా ఉన్నాం, మా బిడ్డ బతికే ఉంటాడని భావిస్తున్నాం, అని ఆర్థిక సలహాదారు క్రిస్టోఫ్ బ్రోడార్డ్, అతని భార్య తమ కొడుకు కోసం వెతుకుతున్నారు.

Flashover : అంతటా మౌనరోదన 2026 జనవరి 1 గురువారం తెల్లవారుజామున 1:30 గంటలకు లె కాన్స్టెలేషన్ బార్ నుండి పొగలు వస్తున్నట్లు సమాచారం వచ్చిందని వలైస్ కాంటోనల్ పోలీస్ కమాండర్ ఫ్రెడెరిక్ గిస్లర్ తెలిపారు. కొన్ని సెకన్ల తర్వాత, ఒక ప్రత్యక్ష సాక్షి అత్యవసర కాల్ సెంటర్ మంటల వీడియోలు పంపించాడు. అగ్నిమాపక సిబ్బందిని రెడ్ అలర్ట్ చేసినట్టు గిస్లర్ చెప్పారు. ప్రస్తుతం ఆల్ఫైన్ స్కీ రీస్టార్ట్ ప్రాంతంలో మౌనం రాజ్యమేలుతోంది.

తమ మృతదేహాలను గుర్తించేందుకు తల్లిదండ్రులు, బంధువులు చేరుకున్నారు. అధికారులు డీఎన్ఏ పరీక్షలు జరుపతున్నారు. ఇక బ్రిటీష్, ఫ్రాన్స్ , ఇటలీ, ఇరాన్ దేశాధినేతలు దిగ్బ్రాంతిని వ్యక్తం చేశారు. ఆసుపత్రుల్లో పెడబొబ్బలు పెడుతున్న క్షతగాత్రులను ఆదుకుంటామని భరోసా ఇచ్చారు. ఇది కేవలం స్వట్జర్లాండ్ విషాదం కాదు.. అంతర్జాతీయ శోకం అని వ్యాఖ్యానించారు. ఈ ఘోర ఖలిలో ప్రాణాలు వీడిన టీనేజర్లను స్మరించుకుంటూ .. బార్ సమీపంలో ఓ బలిపీఠాన్ని ఏర్పాటు చేశారు. బంధువులు, సన్నిహితులు, స్నేహితులు పుఫ్సాంజలి ఘటించారు.
ALO READ : New Night Mare : హ్యాపీ..హెల్ AndhraPrabha Detail News
