ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి..

ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి..

క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే శంకర్ ప్రజా దర్బార్

శ్రీకాకుళం, ఆంధ్రప్రభ : మంగళవారం ఉదయం ఎమ్మెల్యే గొండు శంకర్ క్యాంపు కార్యాలయంలో ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని నిర్వహించారు. నియోజకవర్గంలోని వివిధ ప్రాంతాల నుండి పెద్ద సంఖ్యలో ప్రజలు హాజరై తమ సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు. తాగునీరు, రహదారులు, పెన్షన్లు, రేషన్ కార్డులు, భూ సమస్యలు, విద్యుత్, ఇతర ప్రభుత్వ పథకాల అమలుకు సంబంధించిన అనేక వినతిపత్రాలను ప్రజలు సమర్పించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే స్వయంగా ప్రజల నుండి దరఖాస్తులను స్వీకరించి ప్రతి సమస్యను విన్నారు.

సమస్యల తీవ్రతను గుర్తించి సంబంధిత శాఖల అధికారులకు వెంటనే ఫోన్ ద్వారా ఆదేశాలు జారీ చేశారు. ప్రజలకు ఇబ్బందులు కలగకుండా త్వరితగతిన పరిష్కార చర్యలు చేపట్టాలని అధికారులను సూచించారు. ప్రజల సమస్యలను నిర్లక్ష్యం చేయకుండా బాధ్యతగా వ్యవహరించాలని కూడా హెచ్చరించారు.ప్రజా దర్బార్ ద్వారా ప్రజలకు నేరుగా ప్రజాప్రతినిధిని కలిసే అవకాశం లభించడం పట్ల స్థానికులు హర్షం వ్యక్తం చేశారు. ప్రతి మంగళవారం ఇదే విధంగా ప్రజల సమస్యలు తెలుసుకొని పరిష్కారానికి కృషి చేస్తామని ఎమ్మెల్యే తెలిపారు. ప్రజలకు అందుబాటులో ఉండటం తమ బాధ్యత అని, నియోజకవర్గ అభివృద్ధితో పాటు ప్రతి కుటుంబ సమస్య పరిష్కారానికి కట్టుబడి పనిచేస్తామని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, వివిధ శాఖల అధికారులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Leave a Reply