ప్రకృతి వ్యవసాయంపై అవగాహన సదస్సు

ఊట్కూర్, ఆంధ్రప్రభ ; రైతులు ప్రకృతి వ్యవసాయంపై అవగాహన పెంచుకోవాలని అమీన్ పూర్ సర్పంచ్ టప్ప నాగేష్, సత్య దర్శనం ఫౌండేషన్ గ్రామ భారతి జిల్లా ప్రధాన కార్యదర్శి సత్యనారాయణ, ఏఈఓ రజిత అన్నారు. శనివారం నారాయణపేట జిల్లా ఊట్కూర్ మండల పరిధిలోని అమీన్ పూర్ రైతు వేదిక భవనంలో రైతులకు ప్రకృతి వ్యవసాయంపై అవగాహన సదస్సు నిర్వహించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. మారుతున్న కాలానికి అనుగుణంగా రైతులు ప్రకృతి వ్యవసాయం చేపట్టడం వల్ల తక్కువ పెట్టుబడితో అధిక లాభాలు సాధించవచ్చని అన్నారు. ప్రకృతి వ్యవసాయం చేపట్టడం వల్ల రైతులకు కలిగే లాభాలను గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ రవీందర్ రెడ్డి, ప్రకృతి వ్యవసాయ శిక్షకులు ఉపేందర్, కృషి సఖి సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
