సంక్షేమం అభివృద్ధి కూటమి విజయ రహస్యం
- సెంట్రల్ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు
పాయకాపురం,ఆంధ్రప్రభ: కూటమి పాలనలో రెండు ఏళ్ల నమ్మకం, అభివృద్ధి, సంక్షేమం అనే నినాదంతో చేపట్టిన ఇంటింటి ప్రచార కార్యక్రమాన్ని 1వ డివిజన్ గుణదల ప్రాంతంలో సెంట్రల్ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు,కూటమి శ్రేణులతో కలసి సోమవారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సెంట్రల్ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు ముఖ్య అతిధిగా పాల్గొని ప్రజా ప్రచార యాత్ర ద్వారా ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు ప్రతి ఇంటిని సందర్శిస్తూ కూటమి ప్రభుత్వ విజయాలను ప్రజలకు వివరించడంతో పాటు, వారి సమస్యలను నేరుగా తెలుసుకుని, సూచనలు, సలహాలను స్వీకరించి వాటి పరిష్కారానికి కృషి చేస్తామని పేర్కొన్నారు.
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, కేంద్ర నాయకత్వం ,మంత్రి నారా లోకేష్ నాయకత్వంలో రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరించారు.ఈ కార్యక్రమంలో డివిజన్ టీడీపీ అధ్యక్షుడు కొమ్మినేని సురేష్,డివిజన్, క్లస్టర్, కో-క్లస్టర్,యూనిట్, బూత్ స్థాయి నాయకులు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.
