అండగా… ఏపీ సర్కారు

అండగా… ఏపీ సర్కారు

మృతుడి కుటుంబానికి పెడన ఎమ్యెల్యే రూ.5లక్షల పరిహారం అందజేత


ఆంధ్రప్రభ, పెడన (కృష్ణాజిల్లా) : పెడన నియోజకవర్గం కృత్తివెన్ను మండలం కృత్తివెన్ను గ్రామంలో మొంథా తుఫాన్ ప్రభావం వల్ల కొయ్య సుబ్బారావు (Koyya Subbarao) కుటుంబానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 5 లక్షల రూపాయలు ఆర్థిక సహాయాన్ని ప్రకటించింది. మరణించిన వ్యక్తి కుటుంబానికీ పెడన శాసనసభ్యులు కాగిత కృష్ణ ప్రసాద్ చెక్కును అందజేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పకృతి వైపరీత్యాల్లో సైతం రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu), ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ (Pawan Kalyan), యువ నాయకులు మంత్రి నారా లోకేష్ ఆధ్వర్యంలో కూటమి ప్రభుత్వం ప్రజలకు అన్ని విధాల అండగా నిలిచిందని, మొంథా తుఫాన్ నేపద్యంలో తీసుకున్న ముందస్తు చర్యల వల్ల ప్రజలకు ఎంతో మేలు చేయగలిగామని, ప్రభుత్వం తీసుకున్న ముందస్తు చర్యల పట్ల ప్రజలు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారని పెడన ఎమ్మెల్యే కాగిత కృష్ణ ప్రసాద్ వివరించారు.

Leave a Reply