కాంగ్రెస్ కు వ్యతిరేకంగా బీజేపీ నిరసన ప్రదర్శన

కాంగ్రెస్ కు వ్యతిరేకంగా బీజేపీ నిరసన ప్రదర్శన
చౌటుప్పల్, ఆంధ్రప్రభ : కాంగ్రెస్ పార్టీ మహిళా వ్యతిరేక పార్టీ అని చౌటుప్పల్ మండల బీజేపీ అధ్యక్షులు కైరంకొండ అశోక్ ఆరోపించారు. పార్లమెంట్ లో ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం ప్రవేశపెట్టిన మహిళలకు 33శాతం రిజర్వేషన్ల బిల్లును కాంగ్రెస్ పార్టీ అడ్డుకోవడాన్ని నిరసిస్తూ బీజేపీ మండల పార్టీ అధ్యక్షుడు కైరంకొండ అశోక్ ఆధ్వర్యంలో చౌటుప్పల్ పట్టణంలోని జాతీయ రహదారి పై పెద్ద ఎత్తున నాయకులు, కార్యకర్తలు బైఠాయించి నల్ల బ్యాడ్జీలతో నిరసన ప్రదర్శన చేశారు.
ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ.. మహిళా సాధికారతకు అడ్డంకిగా నిలుస్తున్న కాంగ్రెస్ పార్టీ వైఖరిని తీవ్రంగా ఖండించారు. మహిళా రిజర్వేషన్ బిల్లు పై కాంగ్రెస్ పార్టీ ద్వంద వైఖరిని ప్రదర్షిస్తూ, మహిళలకు న్యాయం చేయకుండా అడ్డుకుంటుందని, మహిళలకు సమాన హక్కులు కల్పించడలో కాంగ్రెస్ కు నిజమైన సంకల్పం ఎప్పుడు లేదని ఈ సంఘటన ద్వారా నిజమైందన్నారు. ఈ సందర్భంగా బీజేపీ నాయకులు కాంగ్రెస్ పార్టీ దిష్టిబొమ్మను దగ్ధం చేయడానికి ప్రయత్నించగా పోలీసులు అడ్డుకొని బీజేపీ నాయకులను అదుపులోకి తీసుకున్నారు.
ఈ కార్యక్రమంలో బీజేపీ సీనియర్ నాయకులు గుజ్జుల సురేందర్ రెడ్డి, రమణగోని శంకర్, కంచర్ల గోవర్ధన్ రెడ్డి, ఆలె చిరంజీవి, బుడ్డ సురేష్, యాస అశోక్ రెడ్డి, ఊడుగు వెంకటేశం, పాలకుర్ల జంగయ్య, ఉబ్బు బుచ్చయ్య, గోశిక నీరజ, బర్మా నాగరాణి, కడెం భాగ్యమ్మ, బోడిగే పద్మ, కట్ట కృష్ణ, దిండు భాస్కర్, లగ్గోని పాండు, కొయ్యడ స్వామి, ఓరకంటి భాను, అమృత దశరథ, మధు లింగస్వామి, బతరాజు వెంకటేష్, వినయ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

