Motorists | శిథిలావస్థలో వంతెన..
Motorists | శిథిలావస్థలో వంతెన..
భయాందోళనలో వాహనదారులు, ప్రజలు
నాగాయలంక, ఆంధ్రప్రభ : మండలంలో కమ్మనమోలు నుంచి నాలి వెళ్లే ప్రధాన రహదారిలో ఉప్పుకాలువ డ్రయిన్ పై ఉన్న వంతెన శిథిలావస్థకు చేరింది. ఈ వంతెనను మూడు దశాబ్దాల కిందట నిర్మించారు. వంతెనకు ఇరువైపులున్న సైడ్ వాల్స్ విరిగి పోయాయి ప్రమాదకరంగా మారింది. రాకపోకలలో వాహనాలు అదుపు తప్పి డ్రయిన్లో పడే ప్రమాదముంది. దీంతో వాహనదారులు (Motorists) భయాందోళనకు గురవుతున్నారు. మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న నాలి గ్రామస్థులు సదరు వంతెన దాటి కమ్మన మోలు మీదుగా నాగాయలంకకు రావాలి. అలాగే నాలి, కమ్మనమోలు రైతులు, ప్రజలు కూడా ఈ వంతెన మీద నుంచే రాక పోకలను కొనసాగిస్తారు. శిథిలావస్థకు చేరిన ఈ వంతెనను నిర్మించాలని అధికారులను నాలి, కమ్మనమోలు ప్రజలు కోరుతున్నారు.
