పదవ తరగతి ఫలితాల్లో విద్యార్థుల ప్రభంజనం

పదవ తరగతి ఫలితాల్లో విద్యార్థుల ప్రభంజనం

  • మండల టాపర్లుగా లోకేశ్వరి, అభిషేక్

జైనూర్/సిర్పూర్ (యు), ఆంధ్రప్రభ: బుధవారం విడుదలైన పదవ తరగతి పరీక్షా ఫలితాల్లో కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా జైనూర్ , సిర్పూర్ (యు) మండలాల విద్యార్థులు అద్భుత ప్రతిభ కనబరిచారు. ప్రభుత్వ విద్యాసంస్థల్లో చదువుతూ మండల స్థాయి టాపర్లుగా నిలిచి తమ పాఠశాలలకు, తల్లిదండ్రులకు పేరు తెచ్చారు.

100% ఫలితాలతో జైనూర్ గిరిజన ఆశ్రమ పాఠశాల రికార్డు
జైనూర్ మండల కేంద్రంలోని గిరిజన సంక్షేమ శాఖ బాలికల ఆశ్రమోన్నత పాఠశాల ఈ ఏడాది 100 శాతం ఫలితాలను సాధించి రికార్డు సృష్టించింది. ఈ పాఠశాలకు చెందిన పరచ లోకేశ్వరి 600 మార్కులకు గాను 542 మార్కులు సాధించి మండల టాపర్‌గా నిలిచింది. గిరిజన ప్రాంత విద్యార్థిని ఇలాంటి ఘనత సాధించడంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది.

మోడల్ స్కూల్ విద్యార్థి అభిషేక్ విజయం
అదేవిధంగా, సిర్పూర్ (యు) మండల కేంద్రంలోని తెలంగాణ మోడల్ స్కూల్ విద్యార్థి జె. అభిషేక్ కూడా తన ప్రతిభను చాటాడు. ఇతడు కూడా 600 మార్కులకు గాను 542 మార్కులు సాధించి మండల స్థాయిలో ప్రథమ స్థానంలో నిలిచాడు.

Leave a Reply