TG | మెదక్ జిల్లాలో ఘటన

TG | మెదక్ జిల్లాలో ఘటన
TG | కౌడిపల్లి, ఆంధ్రప్రభ : ద్విచక్ర వాహనం అదుపుతప్పి యువకుడు మృతిచెందిన సంఘటన మండల పరిధిలోని రైలాపూర్ గేటు సమీపాన ఇవాళ చోటు చేసుకుంది. వివరాల్లోకెళ్తే… వెల్మకన్నె గ్రామానికి చెందిన కర్రోళ్ల సుమంత్ (24) నర్సాపూర్ నుండి ద్విచక్ర వాహనంపై కౌడిపల్లి వస్తున్న క్రమంలో రాయలపూర్ వద్ద జాతీయ రహదారిపై స్తంభానికి ఢీ కొట్టాడు. తీవ్రగాయాలు కావడంతో వెంటనే హైదరాబాద్ ప్రైవేట్ హాస్పిటల్ తీసుకెళ్లారు. చికిత్స పొందుతూ సుమంత్ మృతి చెందాడు. ఈ మేరకు కౌడిపల్లి పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
