రోడ్డు ప్రమాదంలో కాంగ్రెస్ నేత మృతి..

రోడ్డు ప్రమాదంలో కాంగ్రెస్ నేత మృతి..

ఖమ్మం, ఆంధ్రప్రభ: ఖమ్మం జిల్లా కాంగ్రెస్ పార్టీలో తీవ్ర విషాదం నెలకొంది. ఖమ్మంకు చెందిన ప్రముఖ కాంగ్రెస్ నాయకుడు జావీద్ బుధవారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో దుర్మరణం పాలయ్యారు. ఖమ్మం – హైదరాబాద్ జాతీయ రహదారిపై ప్రయాణిస్తుండగా, సూర్యాపేట జిల్లా పిల్లలమర్రి శివారులో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఆయన ప్రయాణిస్తున్న వాహనం అతివేగంతో అదుపు తప్పి రహదారి మధ్యలో ఉన్న డివైడర్‌ను బలంగా ఢీకొట్టింది. సమాచారం అందుకున్న వెంటనే రూరల్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాన్ని వెలికితీసి, పోస్టుమార్టం నిమిత్తం సూర్యాపేట జనరల్ ఆస్పత్రికి తరలించారు.

Leave a Reply