టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా నంద్యాల ఎంపీ…

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా నంద్యాల ఎంపీ…
నంద్యాల బ్యూరో, ఆంధ్రప్రభ : రాష్ట్రవ్యాప్తంగా జాతీయ టిడిపి పార్టీ నియామకాల్లో సమూలం మార్పులు చేశారు.పొలిట్ బ్యూరో, జాతీయ, రాష్ట్ర కమిటీలను బుధవారం టిడిపి పార్టీ ప్రకటించింది. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా మంత్రి నారా లోకేష్ ను ఎంపిక ఎంపిక చేయటం పార్టీ ప్రతిష్టకు పునాదిగా నిలుస్తుంది అన్నారు. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడిగా పల్లా శ్రీనివాస్ ను నియమించారు. సీనియర్లకు గౌరవం… కొత్తవారికి అవకాశాలు కల్పించారు.సామాజిక కోణం కోణంలో నూతన కమిటీల కూర్పును ఏర్పాటు చేశారు.
జాతీయ ప్రధాన కార్యదర్శిగా ముగ్గురిని ఎంపిక చేశారు. వారిలో నంద్యాల పార్లమెంట్ సభ్యురాలు డాక్టర్ బైరెడ్డి శబరిని ఒకరు ఎంపికయ్యారు. ఎంపీగా గెలుపొందినప్పటి నుంచి పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్న శబరి కి ఈ పదవి దక్కడం విశేషం.విధేయత, కష్టపడే తత్వం, అనుభవం లెక్కించి పదవులు ఇచ్చిన అధిష్టానం. నామినేటెడ్ పదవుల్లో అవకాశాలు రాని వారికి పార్టీ పదవుల ద్వారా న్యాయం జరుగుతుందన్నారు.
పొలిట్ బ్యూరోలో అనూహ్య మార్పులు ప్రతి కమిటీలోను నూతనత్వంగ రూపొందించారు.29 మందితో పొలిట్ బ్యూరో, 31 మందితో జాతీయ కమిటీ, 185 మందితో రాష్ట్ర కమిటీ కూర్పు ను నియమించారు.జాతీయ ప్రధాన కార్యదర్శులు-3, జాతీయ ఉపాధ్యక్షులు-18, జాతీయ అధికార ప్రతినిధులు-10 గ ఉన్నారు.రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు-7, రాష్ట్ర ఉపాధ్యక్షులు-16, రాష్ట్ర అధికార ప్రతినిధులు-14, రాష్ట్ర జోనల్ కో-ఆర్డినేటర్ల-10, రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శులు-59, రాష్ట్ర కార్యదర్శులు-77ను ఎంపిక చేశారు.
అన్ని సమీకరణాలు బేరీజు వేసుకుని కమిటీల కూర్పుపై కసరత్తు చేసిన టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు.గతానికి భిన్నంగా పార్టీ కమిటీల కూర్పును కొత్త పుంతలు తొక్కించిన ముఖ్యమంత్రి చంద్రబాబు.రాష్ట్ర కమిటీలోని 185 మందికి గానూ… 50 మంది మహిళలకు చోటు, పొలిట్ బ్యూరో, నియామకాలు చేపట్టారు.
మహినియోజకవర్గాల పునర్ వ్యవస్థీకరణ, 33 శాతం మహిళా రిజర్వేషన్లను దృష్టిలో పెట్టుకుని కసరత్తు చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు గతంలో ఎన్నడూ లేని విధంగా మహిళలకు పెద్ద పీట వేస్తూ కమిటీల కూర్పు పీఠం మహిళలకు ఇచ్చిన గౌరవం గా భావిస్తున్నారు.
