ఇంటింటి ప్రచారంలో బిఆర్ఎస్
మక్తల్ , ఆంధ్రప్రభ ; ప్రజాసేవ మన ప్రాంతం అభివృద్ధి నా అభిమతం అని అభివృద్ధి కోసం మున్సిపల్ ఎన్నికల్లో 10వ వార్డు కౌన్సిలర్ గా తనను అఖండ మెజారిటీతో గెలిపించి మున్సిపాలిటీకి పంపవలసిందిగా బిఆర్ఎస్ అభ్యర్థిగా బరిలో నిలిచిన జుట్ల సంగీత సాగర్ విజ్ఞప్తి చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా శుక్రవారం ఆమె తన పద్ధతుదారులతో కలిసి వార్డు పరిధిలో ముమ్మరంగా ఇంటింటి ప్రచారం చేపట్టారు .గడపగడపకు వెళ్లి తన అజెండాను వివరించారు. ఎన్నికలలో ఎందుకు పోటీ చేస్తున్నాను గెలిచాక ఎలాంటి అభివృద్ధి పనులు చేపడతాను అనే అంశాలను ఓటర్లకు వివరించి మద్దతు ఇవ్వాలని కోరారు. ఈ సందర్భంలో ఓటర్ల నుండి విశేష స్పందన లభించింది. ఈ సందర్భంగా జుట్ల సంగీత సాగర్ మాట్లాడుతూ పదవ వార్డు గత పాలకుల నిర్లక్ష్యం వల్ల అభివృద్ధి చెందలేదన్నారు .
