అక్రమ ఇసుక ట్రాక్టర్ల పట్టివేత

పెద్దవంగర, ఆంధ్రప్రభ : అనుమతులు లేకుండా అక్రమంగా ఇసుక తరలిస్తున్న రెండు ట్రాక్టర్లను పోలీసులు పట్టుకున్నారు.మండలంలోని పోచారం గ్రామ శివారులో మంగళవారం ఎలాంటి ప్రభుత్వ అనుమతులు లేకుండా అక్రమంగా ఇసుకను తరలిస్తుండడంతో రెండు ట్రాక్టర్లను సీజ్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించి కేసు నమోదు చేసినట్లు తెలిపారు. ట్రాక్టర్ డ్రైవర్లు బానోత్ గోపాల్, బానోత్ యాకూబ్ లపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై చిలువేరు ప్రమోద్ కుమార్ తెలిపారు.

Leave a Reply