TG | మీ ఇంటి ఆడపడుచును… ఆదరించి గెలిపించండి

TG | మీ ఇంటి ఆడపడుచును… ఆదరించి గెలిపించండి

19వ వార్డులో గజ్జల మహేశ్వరి ప్రవీణ్ కుమార్

TG | షాద్ నగర్, ఆంధ్రప్రభ : మీ ఇంటి ఆడపడుచును నన్ను ఆదరించి, అభిమానించి, మున్సిపాలిటీ ఎన్నికల్లో 19వ వార్డు భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా మీ ముందుకు వచ్చాను.. నన్ను గెలిపించాలని గజ్జల మహేశ్వరి ప్రవీణ్ కుమార్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. కాలనీలోని సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరిస్తామని.. మీకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటానన్నారు. త‌న‌ను ఆశీర్వదించి, ఆదరించి, బీజేపీ కమలం గుర్తుకు ఓటేసి గెలిపించాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో పసుపులేటి శ్రవణ్ రాము, అజయ్, శ్రీనాథ్, శ్రీహరి, వెంకటేష్, రవీందర్, తదితరులు పాల్గొన్నారు.