బీసీ రాజ్యాధికారమే లక్ష్యం

  • ఉప్పెనలా బీసీ ఉద్యమం
  • ఇక నుంచి ఓట్లు మావే, సీట్లు మావే
  • పెత్తందారి నేతలకు రాజకీయ సమాదే
  • భువనగిరి సభలో ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న

ఆంధ్రప్రభ, ప్రతినిధి, యాదాద్రి : ఇక నుంచి ఓట్లు మనవే.. సీట్లు మనవే.. 2028లో బీసీ రాజ్యాధికారమే లక్ష్యంగా పనిచేయాలని ఎమ్మెల్సీ, తెలంగాణ రాజ్యాధికార పార్టీ అధినేత తీన్మార్ మల్లన్న (చింతపండు నవీన్) అన్నారు. ఆదివారం యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలోని కళాశాల ప్రాంగణంలో జరిగిన రాజ్యాధికార సమరభేరి సభలో ఆయన ప్రసంగించారు.

రాష్ట్ర చరిత్రలో చాలా జిల్లాల్లో బీసీలను అణగదొక్కుతున్నారని, వారందరినీ ఒక్కదాటిపైకి తీసుకొచ్చేందుకు కృషి చేద్దామన్నారు. రాష్ట్రంలోనే కాదు విదేశాల్లో ఉన్న బీసీ నేతలు కూడా ఏకం కావాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఎన్నారైలు కూడా అత్యధిక మంది బీసీలు ఉన్నారని, బీసీలను అణిచివేసే కార్యక్రమాలను వ్యతిరేకించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. నిజాం నిరుపేదలకు ఇచ్చిన భూములను అప్పటి మాజీ మంత్రి కొండా వెంకట రంగా రెడ్డి బీసీ లకు 1955 నుండి 57 వరకు రావాల్సిన భూమిని రాకుండా చేశారని ఆరోపించారు.

ఇక తెలంగాణ లో రాజ్యాధికారమే లక్ష్యంగా పెత్తందార్ల పై సర్జికల్ స్ట్రైక్ మొదలైందని చెప్పారు. యాభై తొమ్మిది మంది పెత్తందారి నేతలను రాజకీయ సమాధి చేయనున్నామని, రాజ్యాధికార లాడాయి మొదలైందని చెప్పారు. దొరల భూముల విషయం లో తగ్గేదే లేదని
కొందరు ఉద్దేశపూర్వకంగానే కాజేసిన భూమిని త్వరలోనే ఆధారాలతో సహా బయట పెడతామని చెప్పారు.