నిరుపేద కుటుంబానికి ఆర్థిక సహాయం

నిరుపేద కుటుంబానికి ఆర్థిక సహాయం

భీమ్‌గల్ రూరల్, ఆంధ్రప్రభ:

భీమ్‌గల్ మండలంలోని సోమవారం బడా భీమ్‌గల్ గ్రామం డబుల్ బెడ్‌ రూమ్‌లో నివసించే భూక్యా అనిత (30) అనారోగ్యంతో మృతి చెందడం ఎంతో బాధాకరం. ఆమెకు ముగ్గురు చిన్న పిల్లలు ఉండటం మరింత కలచివేసే విషయం. కుటుంబ పరిస్థితి అత్యంత దయనీయంగా ఉండి, అంత్యక్రియలకు కూడా డబ్బులు లేని పరిస్థితిని తెలుసుకున్న ఎస్టీ యూనియన్ భీమ్‌గల్ మండల అధ్యక్షులు బోడ అరుణ్ మానవత్వంతో ముందుకు వచ్చి రూ. 1000 నగదు సహాయం అందించారు అలాగే 50కేజీ బియ్యం, కుటుంబానికి ఒక నెలకు సరిపడా నిత్యావసర సరుకులను అందజేశారు.

ఈ కష్ట సమయంలో భూక్యా అనిత కుటుంబానికి మనఃపూర్వక సానుభూతి తెలియజేస్తూ,అవసరమైన వారు తమ వంతు సహాయం అందించాలని మనవి చేస్తున్నాము. ఇలాంటి ఆపదలో ఉన్న కుటుంబాలకు ముందుకూడా మా వంతు సహాయం అందిస్తూ, మానవత్వాన్ని చాటుకుంటూ సేవా కార్యక్రమాలు కొనసాగిస్తామని చెప్పారు.ఈ కార్యక్రమంలో ఎస్టీ యూనియన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply