నేర నియంత్రణ, ప్రజల భద్రతే లక్ష్యం
రాత్రి వేళల్లో కొనసాగుతున్న విజిబుల్ పోలీసింగ్
లాడ్జీలలో ఆకస్మిక తనిఖీలు… ఏటీఎంల వద్ద గట్టి నిఘా
రహదారి ప్రమాదాల నివారణకు “స్టాప్, ఫేస్ వాష్ అండ్ గో”లాడ్జీలు, ఏటీఎంల వద్ద ఆకస్మిక తనిఖీలు
కర్నూలు ప్రతినిధి, ఆంధ్రప్రభ : కర్నూలు జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఆదేశాల మేరకు జిల్లాలో ప్రజల భద్రత, శాంతిభద్రతల పరిరక్షణ కోసం విజిబుల్ పోలీసింగ్ కార్యక్రమాన్ని విస్తృతంగా నిర్వహిస్తున్నారు. నేరాల నియంత్రణతో పాటు ప్రజల్లో భద్రతాభావాన్ని పెంపొందించేందుకు పోలీసులు రాత్రి వేళల్లో ముమ్మర తనిఖీలు చేపడుతున్నారు.
ఈ కార్యక్రమంలో భాగంగా అనుమానాస్పద వ్యక్తులు, వాహనాలను క్షుణ్ణంగా తనిఖీ చేస్తూ నేరాల నియంత్రణకు చర్యలు చేపడుతున్నారు. కర్నూలు, ఎమ్మిగనూరు, పత్తికొండ, ఆదోని సబ్‌డివిజన్ల పరిధిలో పోలీసులు కట్టుదిట్టంగా విజిబుల్ పోలీసింగ్ నిర్వహించారు.
కర్నూలు నగరంలో టూ టౌన్ సీఐ శ్రీధర్ ఆధ్వర్యంలో బ్లూ కోల్ట్స్, క్యూఆర్టీ పోలీసు బృందాలు విస్తృత తనిఖీలు చేపట్టాయి. నగరంలోని పలు లాడ్జీల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించడంతో పాటు ఏటీఎంల వద్ద గట్టి నిఘా ఏర్పాటు చేశారు.
రహదారి ప్రమాదాల నివారణకు “స్టాప్, ఫేస్ వాష్ అండ్ గో” కార్యక్రమాన్ని నిర్వహిస్తూ వాహనదారులకు అవగాహన కల్పించారు.
ప్రజలు పోలీసులకు సహకరించాలని, ఎక్కడైనా అనుమానాస్పద వ్యక్తులు లేదా ఘటనలు గమనించిన వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని అధికారులు కోరారు. అత్యవసర పరిస్థితుల్లో డయల్-112 లేదా డయల్-100కు సమాచారం ఇవ్వాలని సూచించారు.
