పశువుల అక్రమ రవాణాపై ప్రత్యేక నిఘా

పశువుల అక్రమ రవాణాపై ప్రత్యేక నిఘా
- మంచిర్యాల ఏసీపీ ప్రకాష్
జన్నారం, ఆంధ్రప్రభ: పశువుల అక్రమ ప్రవాణాను అరికట్టడానికి ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసినట్లు మంచిర్యాల ఏఏపీ ఆర్.ప్రకాష్ తెలిపారు. రాబోయే బక్రీద్ పండుగను పురస్కరించుకొని అక్రమ రవాణాను అరికట్టడంతో పాటు శాంతిభద్రతల పరిరక్షణలో భాగంగా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు గురువారం సాయంత్రం జన్నారం పోలీస్ స్టేషన్ పరిధిలోని ఇందనపల్లి వద్ద ఏర్పాటు చేసిన అంతర్ జిల్లా ప్రత్యేక చెక్‌పోస్టును ఆయన తనిఖీ చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. చెక్‌పోస్టు వద్ద విధులు నిర్వహిస్తున్న సిబ్బందికి ఏసీపీ పలు కీలక సూచనలు చేశారు.పశువులను అక్రమంగా తరలించే వాహనాల తనిఖీల విషయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ నిర్లక్ష్యం వహించకూడదని ఆయన స్పష్టం చేశారు. ముఖ్యంగా ఇతర రాష్ట్రాల సరిహద్దుల నుంచి వచ్చే పశువుల అక్రమ రవాణాపై ప్రత్యేక నిఘా పెట్టి క్షుణ్ణంగా తనిఖీ చేయాలని, నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన ఆదేశించారు. ఆయన వెంట స్థానిక ఏఎస్ఐ ఉమేష్ కుమార్,హెడ్ కానిస్టేబుల్ దేవన్న, తదితరులు ఉన్నారు.
