బీర్ల అయిలయ్య దిష్టిబొమ్మ దహనం
బీర్ల అయిలయ్య దిష్టిబొమ్మ దహనం
యాదగిరిగుట్ట , ఆంధ్రప్రభ: మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యేతన్నీరు హరీష్ రావు పై ప్రభుత్వవిప్ బీర్ల అయిలయ్య చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసిస్తూ బీఆర్ఎస్ మండల పార్టీ ఆధ్వర్యంలో పట్టణంలో ప్రధాన రోడ్డుపై నిరసన వ్యక్తం చేశారు. ఖబర్ధార్ అయిలయ్య’ బీర్ల అయిలయ్య డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. అనంతరం ప్రధాన కూడళి వద్ద బీర్ల అయిలయ్య దిష్టిబొమ్మ దహనం చేశారు.
6 సార్లు ఎమ్మెల్యేగా, ఇరిగేషన్ శాఖ, ఆర్థికశాఖ, వైద్యారోగ్యశాఖ మంత్రిగా ఈ రాష్ట్రానికి సేవ చేసిన మాజీ మంత్రి హరీశ్ రావు హోదాను మరిచి, అదిష్టానం మెప్పుకోసం నోటికి వచ్చినట్టుగా మాట్లాడితే సహించేది లేదన్నారు.
మాట్లాడేటప్పుడు ఆలోచించి మాట్లాడాలన్నారు. అధికారంలో ఉన్నామని విర్రవీగి నోరు జారితే తగిన గుణపాఠం చెబుతామన్నారు. ఇప్పటి వరకు వరిధాన్యం కొనుగోళ్లు కేంద్రాల్లో 30 శాతం వడ్లను కొనుగోలు చేయని కాంగ్రెస్ ప్రభుత్వానికి రాబోయే రోజుల్లో రైతులే కర్రకాల్చి వాత పెట్టేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య వెంటనే హరీశ్రావుకు క్షమాపణలు చేపట్టాలని డిమాండ్ చేశారు.
