గ్రామాలలో జీపీవోల పాత్ర కీలకం
గ్రామాలలో జీపీవోల పాత్ర కీలకం
భీమ్గల్ రూరల్, ఆంధ్రప్రభ: రాష్ట్రంలో ఉన్న జీపీవోల సమస్యల మీద ఆదివారం జిల్లా మాజీ సర్పంచ్ ల ఫోరం అధ్యక్షులు గొర్తె రాజేందర్ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని వారి నివాసంలో తెలంగాణ రాష్ట్ర టీజీఎండీసీ చైర్మన్ ఈరవత్రి అనిల్ ను తెలంగాణ రాష్ట్ర జీపీవోల ఆర్గనైజింగ్ సెక్రటరీ నిజామాబాద్ జిల్లా భీమ్గల్ మండలం చేంగల్ గ్రామానికి చెందిన సంగేమ్ పృథ్వీరాజ్, ధర్పల్లి మండలం జీపీవోల అధ్యక్షులు తెప్ప రాజేష్, మండలంలోని వివిధ గ్రామాల జిపిఓలతో కలిసి ప్రొబెషన్ డిక్లేర్ గురించి వివరించి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర సర్పంచ్ ఫోరం మాజీ అధ్యక్షుడు రాజేందర్ మాట్లాడుతూ… గ్రామాల అభివృద్ధిలో కీలకపాత్ర ప్రోషిస్తున్న జీపీవోల సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేలా చొరవ చూపాలని చైర్మన్ కోరారు. తెలంగాణ రాష్ట్ర టీజీఎండీసీ ఇరవత్రి అనిల్ సానుకూలంగా స్పందిస్తూ ఈ సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తానని వారికి హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పడ్కాల్ జీపీవో అవినాష్, తదితరులు పాల్గొన్నారు.
.
