ప్రభుత్వ పాఠశాలలో పాఠ్యపుస్తకాల పంపిణీ

ప్రభుత్వ పాఠశాలలో పాఠ్యపుస్తకాల పంపిణీ

డోంగ్లి (బీర్కూర్), (ఆంధ్రప్రభ): లింబూర్ గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించిన పాఠ్యపుస్తకాల పంపిణీ కార్యక్రమం సోమవారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి గ్రామ సర్పంచ్ సుజాత శివారెడ్డి ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థులకు పాఠ్యపుస్తకాలను పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ, ప్రతి విద్యార్థికి విద్యా సంవత్సరం ప్రారంభంలోనే పాఠ్యపుస్తకాలు అందించడం వారి విద్యాభ్యాసానికి ఎంతో ఉపయోగకరమని అన్నారు. విద్యార్థులు చదువుపై ప్రత్యేక శ్రద్ధ కనబర్చి ఉన్నత లక్ష్యాలను సాధించాలని సూచించారు.

పాఠ్యపుస్తకాలు అందుకున్న విద్యార్థులు ఆనందం వ్యక్తం చేశారు. ప్రభుత్వం అందిస్తున్న విద్యా వనరులను సద్వినియోగం చేసుకుని మంచి ప్రతిభ కనబర్చాలని ఉపాధ్యాయులు సూచించారు.

కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు హన్మంత్, ఉపాధ్యాయులు సూర్యకాంత్, వీవో నందాబాయి, పాఠశాల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.