POK| పాక్ బలగాలతో ఘర్షణలు
POK| పాక్ బలగాలతో ఘర్షణలు
POK | ఆంధ్రప్రభ, వెబ్‌డెస్క్: పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్ (పీవోకే)లో పాకిస్థాన్ పాలనకు వ్యతిరేకంగా నిరసనలు ఉధృతమవుతున్నాయి. పాకిస్థాన్ నుంచి విముక్తి కల్పించాలని డిమాండ్ చేస్తూ ప్రజలు పెద్దఎత్తున ఆందోళనలు చేపడుతున్నారు. ఈ నేపథ్యంలో నిరసనకారులు, పాకిస్థాన్ భద్రతా దళాల మధ్య తీవ్ర ఘర్షణలు చోటుచేసుకున్నాయి.
అందిన సమాచారం ప్రకారం, ఈ ఘర్షణల్లో 30 మందికిపైగా పౌరులు ప్రాణాలు కోల్పోగా, మరో 200 మందికి పైగా గాయపడ్డారు. గాయపడిన వారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. పీవోకేలోని బింబేర్, కొట్లీ, ముజఫరాబాద్ ప్రాంతాల్లో పరిస్థితులు అత్యంత ఉద్రిక్తంగా మారాయి. వేలాది మంది ప్రజలు వీధుల్లోకి వచ్చి పాకిస్థాన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.
ఆందోళనలను అణిచివేసేందుకు పాకిస్థాన్ భద్రతా దళాలు భారీగా మోహరించినట్లు సమాచారం. పలు ప్రాంతాల్లో ఆంక్షలు విధించడంతో పాటు, నిరసనకారులను చెదరగొట్టేందుకు బలప్రయోగం చేసినట్లు వార్తలు వెలువడుతున్నాయి. పీవోకేలో కొనసాగుతున్న అశాంతి పరిస్థితులు ప్రాంతీయంగా ఆందోళన కలిగిస్తున్నాయి. మరిన్ని ప్రాంతాలకు నిరసనలు విస్తరించే అవకాశం ఉందన్న అంచనాల మధ్య పరిస్థితిని పాకిస్థాన్ ప్రభుత్వం నిశితంగా పరిశీలిస్తోంది.
