విధి నిర్వహణలో మృతి చెందిన లైన్‌మెన్ కుటుంబానికి రూ.1 కోటి ప్రమాద బీమా

విధి నిర్వహణలో మృతి చెందిన లైన్‌మెన్ కుటుంబానికి రూ.1 కోటి ప్రమాద బీమా

బాధిత కుటుంబానికి ఆర్థిక భరోసా అందజేసిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

హైదరాబాద్, ఆంధ్రప్రభ: ప్రజలకు సేవలందిస్తూ విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన విద్యుత్ ఉద్యోగి కుటుంబానికి అండగా నిలుస్తూ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు ప్రజాభవన్‌లో రూ.1 కోటి విలువైన ప్రమాద బీమా చెక్కును అందజేశారు.

ఎన్‌పీడీసీఎల్ పరిధిలో లైన్‌మెన్‌గా పనిచేస్తున్న సోన్కాంబ్లే ప్రమోద్ కుమార్ విధి నిర్వహణలో ఉండగా జరిగిన ప్రమాదంలో మృతి చెందారు. ఈ నేపథ్యంలో ఆయన సతీమణి, నామినీ అయిన సోన్కాంబ్లే స్వప్నకు ప్రమాద బీమా కింద రూ.1 కోటి చెక్కును డిప్యూటీ సీఎం అందించారు.

యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాతో ఎన్‌పీడీసీఎల్ కుదుర్చుకున్న అవగాహన ఒప్పందం (ఎంఓయూ) ప్రకారం, USSA-2, USSA-3 శాలరీ ప్యాకేజ్ పథకాల కింద ఉద్యోగులకు రూ.1 కోటి విలువైన వ్యక్తిగత ప్రమాద బీమా రక్షణ కల్పిస్తున్నారు. ఈ పథకం ద్వారా మృతుడి కుటుంబానికి ఆర్థిక భరోసా లభించింది.

ఈ సందర్భంగా భట్టి విక్రమార్క మాట్లాడుతూ, ప్రజల సేవలో విధులు నిర్వర్తిస్తూ ప్రాణాలు కోల్పోయిన ఉద్యోగుల కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని తెలిపారు. ఉద్యోగుల సంక్షేమం, భద్రతకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని పేర్కొన్నారు

Leave a Reply