Dalal Street Rally : దలాల్ స్ట్రీట్ … సందదే సందడి Andhra Prabha News

Dalal Street Rally : దలాల్ స్ట్రీట్ … సందదే సందడి Andhra Prabha News
- స్టాక్ మార్కెట్లు పరుగోపరుగు
- కాల్పుల విరమణతో మదుపర్లు ఖుషీఖుషీ
- బీఎస్ఈ 3.58 శాతం గెయిన్
- నిఫ్టీ 50కి 3.16 శాతం లాభం
- ఆర్బీఐ రెపో రేటు ఫోకస్
- సెంటిమెంటు ప్రభావం ఖాయం
( ఆంధ్రప్రభ, ముంబై ప్రతినిధి)
Dalal Street Rally : హోర్ముజ్ జలసంధిని తెరవటానికి ఇరాన్ అంగీకరించటంతో చమురు ధర స్పీడ్ కు బ్రేక్ పడింది. బ్యారెల్ క్రూడ్ ఆయిల్ 100 డాలర్ల కంటే దిగువకు చేరటంతో బుధవారం స్టాక్ మార్కెట్లు కోలుకుంది, ట్రేడింగ్ ప్రారంభంలో సెన్సెక్స్ , నిఫ్టీ పుంజుకున్నాయి. ఇరాన్‌పై రెండు వారాల పాటు దాడులను నిలిపివేస్తున్నట్టు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కాల్పుల విరమణ ప్రకటించిన కొద్దిసేపటికే మదుపర్లు ఊపిరి పీల్చుకున్నారు
Dalal Street Rally : బుధవారం ఉదయం ట్రేడింగ్ సెషన్‌ను బీఎస్ఈ సెన్సెక్స్ 2,674.05 పాయింట్లు ( 3.58 శాతం) పెరిగి 77,290.63 వద్ద దూకుడు పెంచింది. ఎన్ఎస్ఈ నిఫ్టీ50 సైతం 731.50 పాయింట్లకు పెరిగి 3.16 శాతం లాభంతో 23,855.15 పాయింట్లకు చేరి ఉరకులు పెడుతోంది. ఈ రోజు ఆర్బీఐ రెపో రేటు ప్రకటనపై కూడా మార్కెట్లు నిశితంగా గమనిస్తున్నాయి. ఈ ప్రకటన ద్రవ్యోల్బణ అంచనాలు మార్కెట్ సెంటిమెంట్లపై ప్రభావం చూపనున్నాయి.
