IND vs AUS | భార‌త్ మ‌రో వికెట్ డౌన్.. పెవిలియ‌న్ చేరిన‌ కోహ్లీ !

ఛాంపియ‌న్స్ ట్రోఫీలో భాగంగా నేడు జ‌రుగుతున్న తొలి సెమీస్ లో.. ఆసీస్ తో జ‌రుగుతున్న మ్యాచ్ లో భార‌త్ ఐదో వికెట్ కోల్పోయింది. ఫైన‌ల్ బెర్త్ కోసం ఇరు జ‌ట్ల మ‌ధ్య‌ హోరాహోరీగా జ‌రుగుతున్న మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆసీస్.. టీమిండియా ముందు సేన ముందు 265 ప‌రుగుల భారీ ల‌క్ష్యాన్ని నిర్ధేశించింది.

కాగా, భారీ ఛేద‌న‌లో కీల‌క ఇన్నింగ్స్ ఆడిన టీమిండియా ర‌న్ మెషీన్ కోహ్లీ (84) ప‌రుగుల‌కు ఔట‌య్యాడు. గిల్ ఔట‌న త‌రువాల బ‌రిలోకి వ‌చ్చిన కోహ్లీ… 42.2వ ఓవ‌ర్లో జంపా వేసిన బంతికి ఐదో వికెట్ గా వెనుదిరిగాడు.

ప్ర‌స్తుతం ప్ర‌స్తుతం క్రీజులో కేఎల్ రాహుల్ (31) – పాండ్యా ఉన్నారు. భారత్ విజ‌యానికి 44 బంతుల్లో 40 పరుగులు చేయాల్సి ఉంది.

Leave a Reply