TDP MP’S | లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా…

TDP MP’S | లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా…

TDP MP’S | హైద‌రాబాద్‌, ఆంధ్ర‌ప్ర‌భ : లోక్‌స‌భ స్పీక‌ర్ ఓం బిర్లా టీడీపీ ఎంపీల‌కు తేనేటి విందు ఇచ్చారు. ఈ విందులో ఎంపీలు శ్రీకృష్ణదేవరాయలు, దగ్గుమళ్ళ ప్రసాదరావు, హరీష్, భరత్, నాగరాజు, అప్పలనాయుడు, లక్ష్మీనారాయణ పాల్గొన్నారు. స‌భా కార్య‌క్ర‌మాలు జ‌రుగుతున్న తీరు ఇంకా మెరుగ్గా జ‌ర‌గాలంటే ఏం చేయాల‌నే అంశాలపై ఎంపీల నుంచి స‌ల‌హాలు, సూచ‌న‌లు స్పీక‌ర్ తీసుకున్నారు. తొలిసారి స‌భ‌కు వ‌చ్చిన వారికి ఎక్కువ అవ‌కాశాలు ఇవ్వాల‌ని ఎంపీలు కోరారు. త‌మ విజ్ఞ‌ప్తికి సానుకూలంగా స్పందించిన‌ట్లు తేదేపా ఎంపీలు తెలిపారు. అలాగే ఆంధ్ర‌ప్ర‌దేశ్ కూట‌మి ఎంపీలు స్పీక‌ర్‌ను శాలువాతో స‌త్క‌రించారు.

Leave a Reply