దేశ సమగ్రతకు శ్యామా ప్రసాద్ ముఖర్జీ సేవలు చిరస్మరణీయం: విక్రమ్ రెడ్డి
మేడ్చల్, ఆంధ్రప్రభ : దేశ సమగ్రత కోసం, జమ్మూ కాశ్మీర్ భారతదేశంలో అంతర్భాగంగా మారడం కోసం తన జీవితాన్నే త్యాగం చేసిన అమరజీవి, నిఖార్సైన జాతీయవాది డాక్టర్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ అని బీజేపీ రాష్ట్ర నాయకులు విక్రమ్ రెడ్డి కొనియాడారు. డాక్టర్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ జయంతిని పురస్కరించుకొని సైబరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ మేడ్చల్ సర్కిల్ పరిధిలోని గుండ్లపోచంపల్లి డివిజన్
పరిధిలో బీజేపీ డివిజన్ అధ్యక్షులు కావేరీ శ్రీధర్ ముదిరాజ్ ఆధ్వర్యంలో ఘనంగా నివాళులర్పించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విక్రమ్ రెడ్డి హాజరై, శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ చిత్రపటానికి పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భారతదేశ పారిశ్రామిక రంగానికి, విద్యా రంగానికి కేంద్ర మంత్రిగా ముఖర్జీ వేసిన పునాదులు నేటికీ దేశ ప్రగతికి ఎంతగానో తోడ్పడుతున్నాయని గుర్తుచేశారు. ఆయన నిస్వార్థ సేవ, దేశభక్తి ప్రతి ఒక్కరికీ స్ఫూర్తిదాయకమన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి అమరం మోహన్ రెడ్డి, డివిజన్ ప్రధాన కార్యదర్శి జైతువాలా కృష్ణ, మాజీ వార్డు సభ్యులు మలిగే అశోక్, పార్టీ నాయకులు చెంచాల సురేష్ ముదిరాజ్, నవీన్ కుమార్, గడిల వాసుదేవ రెడ్డి, ఉద్దమరి అరుణ్ తదితరులు పాల్గొన్నారు.
