Team India | రూ.131 కోట్ల బహుమతి

Team India | రూ.131 కోట్ల బహుమతి
Team India | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : టీ20 ప్రపంచకప్‌ను రెండోసారి కైవసం చేసుకున్న టీమ్ ఇండియాకు బీసీసీఐ నుంచి భారీ ఆర్థిక బహుమతి ఇస్తున్నట్లు తెలిపింది. ఫైనల్లో న్యూజిలాండ్‌పై 96 పరుగుల తేడాతో గెలిచి వరుసగా రెండోసారి టైటిల్ సాధించిన భారత జట్టుకు బీసీసీఐ రూ.131 కోట్ల భారీ నజరానా ప్రకటించింది.

స్వదేశంలో టీ20 ప్రపంచకప్ ఛాంపియన్‌గా నిలిచిన తొలి జట్టుగా చరిత్ర సృష్టించిన టీమ్ ఇండియాకు క్రికెటర్లు, సిబ్బంది, సెలెక్టర్లకు బీసీసీఐ అభినందనలు తెలిపింది. భవిష్యత్తులోనూ ఇలాంటి విజయాలు సాధించాలని ఆకాంక్షించింది. ఈ గెలుపుతో భారత క్రికెట్ అభిమానుల్లో ఆనందోత్సాహాలు మరింత ఉరకలేస్తున్నాయి.
