నల్ల బ్యాడ్జీలతో ఉపాధ్యాయుల నిరసన..

టేకుమట్ల, ఆంధ్రప్రభ : యుఎస్‌పీసీ ఆధ్వర్యంలో దశలవారీ పోరాటంలో భాగంగా గురువారం టేకుమట్ల మండల కేంద్రంలో ఉపాధ్యాయులు నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా యుఎస్‌పీసీ మండల సభ్యులు, వెంకట్రావుపల్లి హెచ్‌ఎం రమేష్ మాట్లాడుతూ… పీఆర్సీ ప్రకటించాలని, పెండింగ్ డీఏలు విడుదల చేయాలని, బదిలీలు–పదోన్నతులు చేపట్టాలని, విద్యారంగానికి 15 శాతం నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు.

ఉపాధ్యాయుల 13 ప్రధాన డిమాండ్ల పరిష్కారం కోసం నాలుగు దశల్లో ఉద్యమం చేపడుతున్నట్లు తెలిపారు. ప్రభుత్వం స్పందించకపోతే చలో హైదరాబాద్, అనంతరం చలో అసెంబ్లీ కార్యక్రమాలు నిర్వహిస్తామని హెచ్చరించారు. అనంతరం టేకుమట్ల తహసిల్దార్ కు వినతి పత్రాన్ని అందజేశారు కార్యక్రమంలో స్టీరింగ్ కమిటీ సభ్యులు అశోక్, మోహిన్, సూర తిరుపతి, సుమన్, సురేందర్ రాజు, భుజేంద్రచారి తదితరులు పాల్గొన్నారు.