అఖిల భారత విశ్వకర్మ మహాసభ మండల కమిటీ ఎన్నిక
దండేపల్లి, ఆంధ్రప్రభ : ది అఖిల భారత విశ్వకర్మ మహాసభ దండేపల్లి మండల కమిటీని సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు కట్ట వెంకటేష్, జిల్లా అధ్యక్షుడు శ్రీరాముల గంగాధర్ ఆధ్వర్యంలో గురువారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా కొత్తపల్లి శ్రీహరి, ఉపాధ్యక్షుడిగా వేమునూరు లక్ష్మీనారాయణ, ప్రధాన కార్యదర్శిగా కొత్తపల్లి నరసయ్య, సలహాదారుగా దర్శనాల గంగారం, ఉపాధ్యక్షులుగా మేడారపు లక్ష్మీకాంతం, కోశాధికారిగా వేమునూరు లచ్చన్న, ప్రచార కార్యదర్శిగా చోప్పదండి లచ్చన్న ఎన్నికయ్యారు.
కార్యదర్శులుగా బొక్కనపెల్లి స్వామి, రెవెల్లి సత్యనారాయణ, తుపాకుల లక్ష్మీనారాయణ, సాంస్కృతిక కార్యదర్శిగా కట్ట రాజమౌళిచారి, సంయుక్త కార్యదర్శిగా బొక్కేనాపెళ్లి సత్యనారాయణలను ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమంలో సంఘం నాయకులు జంభోజు లింగమూర్తి, పట్టణ అధ్యక్షుడు నూతుల శ్రీకాంత్ చారి, ఇనుగుర్తి శ్రీనివాస్, దేవరకొండ లక్ష్మీనారాయణ, టింబర్ డిపో యజమాని పిట్టల అశోక్, కరుణాచారి, వేమునూరు సత్యనారాయణ, వెంకటేష్, దేవయ్య, కిషన్, రవి తదితరులు పాల్గొన్నారు.
