భూపాలపల్లి కాంగ్రెస్‌లో కొత్త అధ్యక్షులు..

పట్టణానికి దాట్ల శ్రీనివాస్..
మండలానికి రామినేని రవీందర్..

భూపాలపల్లి టౌన్, ఆంధ్రప్రభ : కాంగ్రెస్‌ పార్టీ భూపాలపల్లి పట్టణ అధ్యక్షులుగా దాట్ల శ్రీనివాస్‌, మండల అధ్యక్షునిగా రామినేని రవీందర్‌ నియమితులయ్యారు. టీపీసీసీ అధ్యక్షుడు బి. మహేశ్‌కుమార్‌ గౌడ్‌ ఆమోదంతో, డీసీసీ అధ్యక్షుడు బట్టు కరుణాకర్‌ సంప్రదింపుల మేరకు ఈ నియామకాలు చేపట్టారు. ఈ సందర్భంగా నూతన అధ్యక్షులు పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేయడంతోపాటు నాయకులు, కార్యకర్తలను సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగాలని పార్టీ నాయకులు సూచించారు. పట్టణ, మండల పరిధిలో ప్రజా సమస్యలపై స్పందిస్తూ కాంగ్రెస్‌ పార్టీ విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని కోరారు. నూతన అధ్యక్షుల నియామకంపై పార్టీ నాయకులు, కార్యకర్తలు హర్షం వ్యక్తం చేస్తూ వారికి అభినందనలు తెలిపారు.