సూర్యాపేట మీదుగా బుల్లెట్ ట్రైన్ కారిడార్ ఏర్పాటు చేయాలి
సూర్యాపేట, ఆంధ్రప్రభ : సూర్యాపేట మీదుగా బుల్లెట్ ట్రైన్ కారిడార్ ఏర్పాటు చేయాలని ఐక్య విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో గురువారం మహర్యాలీ లో భాగంగా భారీ ప్రదర్శన చేశారు. కొత్త బస్టాండ్ నుండి పెద్దఎత్తున విద్యార్థులు 60 ఫీట్ల రోడ్డు, వాణిజ్య భవన్ సెంటర్ వద్ద వేలాదిమంది విద్యార్థులు భారీ నిరసన వ్యక్తం చేస్తూ నినాదాలు చేశారు. ఈ సందర్బంగా పలువురు విద్యార్థి సంఘాల నాయకులు మాట్లాడుతూ ప్రధాన వాణిజ్య, విద్యా, పారిశ్రామిక కేంద్రాన్ని బుల్లెట్ ట్రైన్ అలైన్మెంట్ నుంచి తొలగించడం సరి కాదన్నారు. రైల్వే లైన్ సూర్యాపేట ప్రాంత ప్రజల చిరకాల వాంఛ అన్నారు. బుల్లెట్ ట్రైన్ సాధన కోసం దశలవారీగా ఉద్యమంలో భాగస్వామ్యం అవుతామన్నారు.
