Karnataka CM | గవర్నర్‌కు రాజీనామా లేఖ అందజేయనున్న సీఎం

Karnataka CM | ఆంధ్రప్రభ, వెబ్‌డెస్క్ : సిద్ధరామయ్య కర్ణాటక ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ పరిణామంతో కర్ణాటక రాజకీయాల్లో ఒక్కసారిగా కలకలం రేగింది.
మధ్యాహ్న భోజనం అనంతరం గవర్నర్‌ను కలిసి తన రాజీనామా లేఖను అందజేయనున్నట్లు సమాచారం. రాజీనామా నిర్ణయానికి గల కారణాలపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.
సిద్ధరామయ్య ఆకస్మిక నిర్ణయం నేపథ్యంలో రాష్ట్ర రాజకీయాల్లో ఉత్కంఠ నెలకొంది. కాంగ్రెస్ పార్టీ తదుపరి నాయకత్వంపై రాజకీయ వర్గాల్లో చర్చలు ప్రారంభమయ్యాయి. కొత్త ముఖ్యమంత్రి ఎంపికపై అధిష్టానం కీలక నిర్ణయం తీసుకునే అవకాశముంది.
