భళా రవికుమార్.. ప్రజలు ప్రశంసలు..
భళా రవికుమార్.. ప్రజలు ప్రశంసలు..
అకాల వర్షానికి అప్రమత్తమైన టీడీపీ కమిటీ.
వర్షపు నీటిని యుద్దప్రాతిపదికన మల్లింపు చర్యలు..
పాయకాపురం, ఆంధ్రప్రభ : ప్రజా సమస్యలపై స్పందించే నాయకుడు డివిజన్కు ఉంటే ప్రజలకు కావాల్సింది ఏంటి.అటువంటి నాయకుడు కె.రవికుమార్.సెంట్రల్ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు ఆదేశాల మేరకు స్థానిక64వ డివిజన్ టీడీపీ అధ్యక్షుడుగా కె.రవికుమార్ నియమితులయ్యారు. అప్పటి నుండి డివిజన్లోని సమస్యలపై రవికుమార్ ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు.


ఈక్రమంలో బుధవారం రాత్రి కురిసిన వర్షానికి డివిజన్ ప్రాంతంలో పలు లోతట్టు రహదారులు జలమయం అయ్యాయి.ఈ విషయం తెలుసుకున్న రవికుమార్ వెంటనే అప్రమత్తమై ఎమ్మెల్యే బొండా ఉమా దృష్టికి తీసుకువచ్చారు. వీఎంసీ అధికారులతో కలసి రవికుమార్ జేసిబి సాయంతో పంపింగ్ స్టేషన్ వద్ద గుర్రపు డెక్కను పూర్తిగా తొలగించారు.అంతేకాకుండా 33తూములు వద్ద గుర్రపు డెక్కలను తొలగించారు.దీంతో రహదారులపై నిలచిన నీరు పూర్తిగా సైడ్ కాల్వలు గుండా33తూములు వైపు మల్లాయి.
మల్లింపు చర్యలు..
రోడ్లపై,లోతట్టు ప్రాంత రహదారిపై నిలచిన వర్షపు నీరును అధికారులతో కలసి జేసిబి,వీఎంసీ శానిటేషన్ సిబ్బందితో కలసి మల్లింపు చర్యలు చేపట్టాము.సెంట్రల్ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు ఆదేశాల మేరకు స్థానిక64వ డివిజన్ కండ్రికలో డ్రైనేజి పంపింగ్ స్టేషన్,33తూములు కాల్వలోకి వర్షపు నీటిని మల్లించడం పరిస్థితులు పూర్తిగా అదుపులోకి వచ్చాయి.గత వరద సమయంలో చేసిన పనులను దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు అదే రీతిలో చర్యలు చేపట్టాం.
