Union Minister | నౌకపై దాడి.. ముగ్గురు భారతీయులు మృతి

Union Minister | ఆంధ్రప్రభ, వెబ్‌డెస్క్: ఒమన్‌ తీర ప్రాంతంలో భారతీయ సిబ్బందితో ప్రయాణిస్తున్న సెటెబె వాణిజ్య నౌకపై అమెరికా జరిపిన దాడిలో ముగ్గురు భారతీయ నావికులు ప్రాణాలు కోల్పోయినట్లు కేంద్ర మంత్రి సర్బానంద సోనోవాల్ వెల్లడించారు.

మృతుల కుటుంబాలకు కేంద్ర ప్రభుత్వం అండగా ఉంటుందని ఆయన హామీ ఇచ్చారు. ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన కేంద్రం, బాధిత కుటుంబాలకు అవసరమైన సహాయ సహకారాలు అందించనున్నట్లు తెలిపింది.

ఇదిలా ఉండగా, వాణిజ్య నౌకలపై అమెరికా దాడులను భారత్ తీవ్రంగా తప్పుబట్టింది. అంతర్జాతీయ జలాల్లో ప్రయాణిస్తున్న వాణిజ్య నౌకల భద్రతకు భంగం కలిగించే చర్యలను వెంటనే నిలిపివేయాలని డిమాండ్ చేసింది. సముద్ర రవాణా భద్రతకు ముప్పు కలిగించే ఇటువంటి దాడులు ఆందోళనకరమని పేర్కొంది. ఈ ఘటనకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Leave a Reply