ఎస్పీని మర్యాదపూర్వకంగా కలిసిన సౌత్ డీఎస్పీ..

గుంటూరు క్రైమ్, ఆంధ్రప్రభ : గుంటూరు జిల్లా సౌత్ డీఎస్పీగా నూతనంగా బాధ్యతలు స్వీకరించిన జి. పూర్ణచంద్రరావు సోమవారం జిల్లా పోలీసు కార్యాలయంలో జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ ను మర్యాదపూర్వకంగా కలిశారు.

ఈ సందర్భంగా డీఎస్పీ పూర్ణచంద్రరావు ఎస్పీకి పూల మొక్కను అందజేశారు. అనంతరం ఎస్పీ వకుల్ జిందాల్ మాట్లాడుతూ, ప్రజలకు మరింత మెరుగైన పోలీసు సేవలు అందించడంతో పాటు చట్టం, శాంతిభద్రతల పరిరక్షణలో సమర్థవంతంగా విధులు నిర్వహించాలని ఆకాంక్షిస్తూ పూర్ణచంద్రరావుకు శుభాకాంక్షలు తెలిపారు. కాగా.. పూర్ణచంద్రరావు జిల్లా పోలీసు శిక్షణ కేంద్రం (డీటీసీ) నుంచి ఇక్కడకు బదిలీపై వచ్చారు.