సంక్షేమం, అభివృద్ధి కూటమి ప్రభుత్వంతోనే సాధ్యం
ఇంటింటికీ తెలుగుదేశం కార్యక్రమంలో జంపాల
ఇబ్రహీంపట్నం, ఆంధ్రప్రభ : సంక్షేమం, అభివృద్ధి కూటమి ప్రభుత్వంతోనే సాధ్యమని టీడీపీ సీనియర్ నేత జంపాల సీతారామయ్య అన్నారు. క్లస్టర్ ఇన్ చార్జి, కౌన్సిలర్ చనమోలు నారాయణ ఆధ్వర్యంలో ఇంటింటికీ తెలుగుదేశం కార్యక్రమాన్ని సోమవారం ప్రారంభించారు. ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి, సంక్షేమాన్ని ప్రజలకు వివరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జరుగుతున్న మంచిని ప్రజలకు వివరించాలని, ఆ బాధ్యతను కార్యకర్తలు తీసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో కొండపల్లి మున్సిపల్ చైర్మన్ చెన్నుబోయిన చిట్టిబాబు, ఇబ్రహీంపట్నం పీఏసీఎస్ చైర్మన్ కోయ నెహ్రూ, టీడీపీ పట్టణ అధ్యక్షుడు కరిమికొండ బాలాజీ, కూచిపూడి దిలీప్ కుమార్, దుర్గారావు తదితరులు పాల్గొన్నారు.
