Tangutur | యుగ పురుషుడు ఎన్టీఆర్

Tangutur | యుగ పురుషుడు ఎన్టీఆర్

  • మంత్రి స్వామి

Tangutur | టంగుటూరు, ఆంధ్రప్రభ : యుగపురుషుడు అన్న ఎన్టీఆర్ అని మంత్రి స్వామి, మారిటైమ్ బోర్డు చైర్మన్ దామచర్ల సత్య అన్నారు. మండలంలోని తూర్పునాయుడుపాలెంలో ఆదివారం ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా ఎన్టీఆర్, దామచర్ల ఆంజనేయులు విగ్రహాలకు నివాళులర్పించిన మంత్రి డీఎస్ బీవీ స్వామి, మ్యారిటైం బోర్డు చైర్మన్ దామచర్ల సత్య పూలమాలలు వేసి నివాళులర్పించారు.

ఈ సందర్భంగా మంత్రి స్వామి మాట్లాడుతూ.. ఎన్టీఆర్ అనేది మూడక్షరాల పేరు కాదు అది తెలుగుజాతి ఆత్మ గౌరవ ప్రతీక. తెలుగు జాతి శక్తిని దశ దిశలా చాటి చెప్పిన మహనీయులు ఎన్టీఆర్. సంక్షేమానికి ఆద్యుడు అన్న ఎన్టీఆర్. విప్లవాత్మకమైన సంక్షేమ, అభివృద్ధి పధకాలు తీసుకొచ్చి పేదల గతిని మార్చిన మహనీయుడు ఎన్టీఆర్. పేదలకు రెండు రూపాయలకే కిలో బియ్యం, పక్కా ఇళ్లు, జనతా వస్త్రాలు, ఆస్తిలో మహిళలకు సమాన వాటా వంటి విప్లవాత్మక నిర్ణయాలతో ఎన్టీఆర్ పాలనలో తనదైన ముద్ర వేశారు. ఎన్టీఆర్ సినీ రంగంలో ఉన్నా, రాజకీయ రంగంలో ఉన్న ప్రజా సంక్షేమం కోసం పాటుపడ్డారు. తెలుగు ప్రజల గుండెల్లో దేవుడిలా ఎన్టీఆర్ చిరస్థాయిగా నిలిచిపోయారు. తెలుగుజాతి ఉన్నంతకాలం ఎన్టీఆర్ కీర్తి అజరామరంగా వెలుగుతూనే ఉంటుంది. ఎన్టీఆర్ ఆశయాలగుణంగా సీఎం చంద్రబాబు నాయుడు, మంత్రి లోకేష్ పాలన సాగిస్తున్నారు.

Leave a Reply