Tamil Cinema | అన్న గారు వస్తారు..

Tamil Cinema | అన్న గారు వస్తారు..
Tamil Cinema | ఆంధ్రప్రభ వెబ్ డెస్క్ : కోలీవుడ్ హీరో విజయ్ నటించిన లేటెస్ట్ మూవీ జన నాయగన్. ఈ సినిమాని జన నాయకుడు పేరుతో రిలీజ్ చేయాలి అనుకున్నారు. అయితే.. ఈ సినిమా (Movie) సెన్సార్ చిక్కుల్లో పడింది. శుక్రవారం మద్రాస్ హైకోర్టు ఈ మూవీకి క్లియరెన్స్ ఇవ్వడంతో విజయ్ ఫ్యాన్స్ హ్యాపీగా ఫీలయ్యారు.
అయితే.. వెంటనే సీబీఎఫ్ సీ డివిజన్ బెంచ్ ను ఆశ్రయించింది. ఈ పిటిషన్ ను కోర్టు (Court) స్వీకరించడంతో కథ మళ్లీ మొదటికి వచ్చింది. నిర్మాణ సంస్థ కేవీఎన్ ప్రొడక్షన్స్ కూడా ఇక తమ చేతుల్లో ఏమీ లేదని ఆవేదనను వ్యక్తం చేసింది. విజయ్ సినిమా జన నాయకుడు సెన్సార్ పిటిషన్ పై ఈ నెల 21న కోర్టు హియరింగ్ ఉంది.

విజయ్ సినిమా సంక్రాంతి బరి నుంచి తప్పుకోవడంతో.. కార్తీ వా వాతియార్ సినిమా లైన్ లోకి వచ్చినట్లు తెలుస్తోంది. గత డిసెంబర్ లో ఈ సినిమా రిలీజ్ (Release) కావాల్సిఉంది. తెలుగులో అన్నగారు వస్తారు పేరుతో రిలీజ్ కు రెడీ చేశారు. ఇక్కడ ప్రీ రిలీజ్ ఈవెంట్, ఇంటర్వ్యూలతో ప్రచారం నిర్వహించారు. తీరా చివరి నిమిషంలో ఆర్థిక లావాదేవీల నేపథ్యంలో కోర్టు కేసుతో సినిమా విడుదల ఆగిపోయింది.

జన నాయగన్ ఆగిపోయినందున తమిళంలో వా వాతియార్ కు రిలీజ్ స్పేస్ దొరికింది. ఈ చిత్రాన్ని తమిళంతో పాటు తెలుగులో వీలైనంత త్వరలో రిలీజ్ చేయాలని మేకర్స్ ప్లాన్ (Makers Plan) చేస్తున్నారు. ఈ చిత్రాన్ని స్టూడియో గ్రీన్ సంస్థలో జ్ఞానవేల్ రాజా నిర్మించారు. కృతి శెట్టి హీరోయిన్ గా నటించింది. ఆమెకిది కోలీవుడ్ ఎంట్రీ మూవీ. నలన్ కుమారస్వామి ఈ మూవీని తెరకెక్కించారు.
