సమ్మర్ క్యాంపులను సద్వినియోగం చేసుకోవాలి..

జన్నారం, ఆంధ్రప్రభ : ప్రభుత్వం పాఠశాలల్లో ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన సమ్మర్ క్యాంపులను విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా విద్యాశాఖాధికారి ఎస్. యాదయ్య అన్నారు.మంచిర్యాల జిల్లా జన్నారం మండల కేంద్రంలోని పీఎంశ్రీ జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో ఏర్పాటుచేసిన సమ్మర్ క్యాంపు ను ఆయన గురువారం మధ్యాహ్నం సందర్శించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సమ్మర్ క్యాంపుల వల్ల విద్యార్థుల్లో స్కిల్ డెవలప్మెంట్ అభివృద్ధి చెందుతుందన్నారు.

మండలంలోని కలమడుగు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను ఆయన సందర్శించారు.అనంతరం పాఠశాల డైరెక్టర్ ఎఫ్ఆర్సీ ద్వారా ఉత్తమ హాజరు శాతం పొందిన పాఠశాల హెచ్ఎం కట్ట రాజమౌళికి ప్రశంసా పత్రం అందజేసి డీఈఓ అభినందించారు.టెన్త్లో ఉత్తమ ర్యాంకులు పొందిన విద్యార్థులను ఆయన సన్మానించారు.ఈ కార్యక్రమంలో ఎంఈఓ విజయకుమార్,ఆ పాఠశాలల హెచ్ఎం గోళ్ల రామన్న,కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు గుర్రం మోహన్ రెడ్డి, కలమడుగు సర్పంచి బొంతల నాగమణి- మల్లేష్,తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply