Former | సద్వినియోగం చేసుకోవాలి..
Former | సద్వినియోగం చేసుకోవాలి..
తుగ్గలి, ఆంధ్రప్రభ : రైతులు కొసం ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఐదు సూత్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని మాజీ వైస్ ఎంపీపీ చంద్రశేఖర యాదవ్, టిడిపి మండల కన్వీనర్ తిరుపాల్ నాయుడు లు అన్నారు వ్యవసాయ అధికారులు (Agricultural officers) బుధవారము జీ. ఎర్రగుడి, మారెళ్ళ గ్రామాలలో నిర్వహించిన రైతన్నా ! మీకోసం కార్యక్రమాలను వారు ప్రారంభించారు. రైతాంగం కోసం ప్రభుత్వం ప్రవేశపెట్టిన నీటి భద్రత, ఆధారిత, వ్యవసాయ సాంకేతికత, వ్యవసాయం ఆహార సంస్కరణ, ప్రభుత్వ మద్దతు అనే ఐదు అంశాలు పై వారు రైతులకు వివరించారు. రైతుల జీవనోపాధి, ఆర్థిక స్థితి నైపుణ్యాభివృద్ధితో అంచనావేసి రైతుల్లో శాశ్వత మార్పు తీసుకురావడం లక్ష్యంగా ప్రభుత్వం రైతన్న ఇంటింటా మీకోసం సర్వే కార్యక్రమం చేపట్టిందన్నారు. ఈ కార్యక్రమం లో వ్యవసాయ సిబ్బంది లోహితు, అనిల్ నాయుడు,మాజీ ఎంపీటీసీ ఈ.వెంకట రాముడు, టిడిపి నాయకులు దేవరిoటీ వెంకట రాముడు,మామిల్లకుంట ఎడవల్లి తిమ్మప్ప, తదితరులు పాల్గొన్నారు.
