ఉచిత వైద్య శిబిరాలు సద్వినియోగం చేసుకోవాలి
ఉచిత వైద్య శిబిరాలు సద్వినియోగం చేసుకోవాలి
- రాష్ట్ర సహకార యూనియన్ లిమిటెడ్ చైర్మన్ శ్రీ మానాల మోహన్ రెడ్డి
భీంగల్ టౌన్, ఆంధ్రప్రభ ; గ్రామీణ ప్రాంతాల్లో ఏర్పాటు చేస్తున్న వైద్య శిభిరాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని రాష్ట్ర సహకార సంఘాల చైర్మన్ మానాల మోహన్ రెడ్డి అన్నారు. ఆదివారం
విష్ణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఆధ్వర్యంలో భీంగల్ పట్టణ కేంద్రంలో మెగా హెల్త్ క్యాంప్ నిర్వహించడం జరిగింది. ఈ మెగా క్యాంప్ ముఖ్యఅతిథిగా విచ్చేసిన మానాల మోహన్ రెడ్డి మాట్లాడుతూ.. ఇలాంటి కార్యక్రమాలు ఇంకా పెద్ద ఎత్తున జరపాలని జరపడానికి తన వంతు కృషి కూడా చేస్తానని తెలియజేశారు.
బాల్కొండ నియోజకవర్గం లో ప్రతి మండలంలో మెగా హెల్త్ క్యాంప్ నిర్వహించి ప్రజలకు మరింత సేవ చేసే అవకాశం కలుగుతుంధన్నారు, ఇలాంటి క్యాంప్ ద్వారా చిన్నచిన్న సమస్యలను పరిష్కరించవచ్చు పెద్ద సమస్య ఎదురైతే దానికి తగ్గట్టుగా పెద్ద లెవెల్లో కూడా హెల్ప్ చేయడానికి వీలవుతుందని అన్నారు.
ఆర్థిక సహాయం ఎంత చేసినా కలగని ఆనందం పదిమంది ఆరోగ్యాన్ని ఇచ్చినప్పుడు కలుగుతుందని, యువత డ్రగ్స్, మద్యం లాంటి వ్యసనాలకు బానిస అవుతున్నారు వారికి కూడా తగిన కౌన్సిలింగ్ ఇవ్వాలని కోరారు. అందరం కలిసి పని చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆలోచన మేరకు విద్యా వైద్యం లో దేశంలో తెలంగాణ నెంబర్ వన్ గా ఉండాలని అన్నారు డాక్టర్ కే రామానేశ్వర్ కు ప్రజాసేవ చేయాలనే ఆలోచన కలగడం ఆనందం అని అన్నారు. ఇలాంటి కార్యక్రమాలు ఇంకా పెద్ద ఎత్తున జరుపుకోవాలని అన్నారు.
ఈ కార్యక్రమంలో ఐఎన్ఏ అధ్యక్షులు విశాల్, విష్ణు హాస్పిటల్ డైరెక్టర్ కె రామనేశ్వర్ భీంగల్ మున్సిపల్ చైర్మన్ బోదిరే స్వామి, వైస్ చైర్మన్ జేజే నర్సయ్య, కౌన్సిలర్ నాగేంద్రబాబు, సందీప్, అనంతరావు, కృష్ణ, మాజీ ఎంపీపీ కన్నె సురేందర్, పురాణిపేట్ సర్పంచ్ బుర్ర దేవేందర్ గౌడ్ పడగెల సర్పంచ్ రాజు , లింబన్న, బాలగంగాధర్, గంగారాం కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
