పి ఆర్ సి కమిటీ చైర్మన్ ను నియమించండి..

పి ఆర్ సి కమిటీ చైర్మన్ ను నియమించండి..
పదవి విరమణ చేసిన ఉద్యోగుల బెనిఫిట్స్ చెల్లించాలి
వ్యవసాయ శాఖ ఉద్యోగుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకుని వెళతాం
ఆంధ్రప్రభ విజయవాడ : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్స్ ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న వేతన సవరణ కమిటీ చైర్మన్ నియామకం జరపాలని, వేతన స్వరమా తృతీయతను పూర్తి చేయాలని, ఇప్పటికే రెండున్నర సంవత్సరాల పైగా కాలాతీతం అయిందని, కుటుంబ ప్రభుత్వం ఏర్పడే దాదాపు 20 నెలలో కాలమైనా వేతన సవరణ కమిటీ చైర్మన్ నియమించకపోవడం ఉద్యోగులను ఆందోళనకు గురిచేస్తుందని ఏపీ ఎన్జీవో సంఘ రాష్ట్ర అధ్యక్షుడు, ఏపీ జెఎసి చైర్మన్ ఏ. విద్యాసాగర్ డిమాండ్ చేశారు.
విజయవాడ, వెటర్నరీ కాలనీ లో అగ్రికల్చరల్ ఆఫీసర్స్ అసోసియేషన్ సమావేశం మందిరంలో జరిగిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవసాయ ఉద్యోగుల సర్వీసెస్ సంఘ రాష్ట్ర అధ్యక్షుడు సాయి అధ్యక్షతన జరిగిన రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో ముఖ్యఅతిథిగా హాజరైన A. విద్యాసాగర్ మాట్లాడుతూ… పదవి విరమణ చేసిన ఉద్యోగులు సంవత్సరం రకాలముగా పదవీ విరమణ బెనిఫిట్స్ రాకపోవడం వల్ల తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారని, రాష్ట్ర ప్రభుత్వం పదవి విరమణ చేసిన వారికి ప్రాధాన్యత క్రమంలో ముందుగా చెల్లింపులు జరపాలని కోరారు. వ్యవసాయ శాఖ ఉద్యోగుల ప్రమోషన్లు తదితర అంశాలపై ఏపీ ఎంజి జీవో సంఘం రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి సమస్యలు పరిష్కరించిందని, వాటిపై రాష్ట్ర ప్రభుత్వం సానుకూలంగా ఇతరులు ఇచ్చిందని, వ్యవసాయ శాఖ ఉద్యోగులు దశాబ్దాల కాలంగా ఏపీ ఎన్జీవో సంఘంలో ప్రముఖ పాత్ర పోషిస్తున్నారని, ఏపీ అంజి జీవో సంఘంలో గత ఐదు దశాబ్దాలుగా మన్నన పొందిన అనేకమంది నాయకులు వ్యవసాయ శాఖ నుంచి వచ్చి ఎన్జీ జీవో సంఘానికి నాయకత్వం వహించారని వేతన సవరణ మరియు కీలక అంశాలలో ముఖ్య భూమిక పోషించారని విద్యాసాగర్ తెలిపారు. వ్యవసాయ శాఖ ఉద్యోగులకు సంబంధించిన డిపార్ట్మెంట్ సమస్యలు గానీ సర్వీస్ సమస్యలు గానీ ప్రమోషన్లు అలాగే అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ పోస్టుల మంజూరు వంటి సమస్యలపై ఏపీ ఎన్జీ జీవో సంఘం పూర్తి ఇస్తుందని కార్య సాధన దిశగా కృషి చేస్తుందని తెలిపారు.
ఉద్యోగులకు సంబంధించిన పోలీస్ కేసులు ఎత్తివేత, జిపిఎఫ్ ఏపీ జి ఎల్ ఐ చెల్లింపులు, సిపిఎస్ కంట్రిబ్యూషన్, మెడికల్ బిల్లుల చెల్లింపులు తదితర అంశాలలో గత ప్రభుత్వం బిల్డింగ్ లో పెట్టిన బకాయిలు మంజూరు విషయంలో సానుకూలత ఉన్నప్పటికీ పదవీ విరమణ చేసిన ఉద్యోగుల గ్రాట్యుటీ మరియు సరెండర్ లీవులు చెల్లింపు, అలాగే సర్వీసులో ఉన్న ఉద్యోగులకు సంబంధించి గత నాలుగు సంవత్సరాలుగా పెండింగ్లో ఉన్న సరెండర్ లీవుల చెల్లింపు ప్రక్రియ కూడా ప్రారంభం కావాలని కోరారు. ఉద్యోగులు పిఆర్సి కమిటీ విషయంలో అలాగే సరెండర్ లీవుల చెల్లింపు విషయంలో పూర్తి అసంతృప్తిగా ఉన్నారని, రెండు సంవత్సరాల కాలం అయినా కొట్టుమి ప్రభుత్వం ఈ విషయంపై దృష్టి సారించకపోవడం సబబు కాదని అన్నారు. ఉద్యోగులకు సంబంధించిన అనేక విషయాల మీద సానుకూలంగా ఉన్న రాష్ట్ర ప్రభుత్వం, ఈ విషయాలు మీద కూడా దృష్టి సారించాలని కోరారు.ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ నుంచి ఎన్జీవో సంఘ ఆఫీస్ బేరర్స్ గా ఈ మధ్యనే జరిగిన ఎన్నికలలో ఎన్నికైన నాయకులందరికీ శ్రీ విద్యాసాగర్ చేతుల మీదుగా సత్కరించారు.
ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ ఉద్యోగుల సర్వీసు సంఘ రాష్ట్ర అధ్యక్షుడు సాయి కుమార్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రవికుమార్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఎన్టీఆర్ జిల్లా ఎన్జీవో సంఘ అధ్యక్షుడు డి సత్యనారాయణ రెడ్డి, కార్యదర్శి పి రమేష్, గుంటూరు జిల్లా ఎన్జీవో సంఘ కార్యదర్శి శ్యాంసుందర్, కర్నూలు జిల్లా ఎంజి జీవో సంఘ జిల్లా కార్యదర్శి కాశన్న, విజయవాడ నగర శాఖ అధ్యక్షుడు సివిఆర్ ప్రసాద్ కార్యదర్శి నజీర్, వ్యవసాయ శాఖ ఉద్యోగ సంఘాల నాయకులు డి ఎస్ ఎన్ శ్రీనివాస్, లలిత్ కుమార్ తదితరులు పాల్గొన్నారు
